Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ల లోపం.. డైట్‌ మార్చకపోతే అంతే సంగతులు..!

Health Tips: శరీరాన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి అనేక రకాల పోషకాలు అవసరమవుతాయి.

Update: 2023-03-28 14:30 GMT

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ల లోపం.. డైట్‌ మార్చకపోతే అంతే సంగతులు..!

Health Tips: శరీరాన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి అనేక రకాల పోషకాలు అవసరమవుతాయి. ఇందులో విటమిన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటి సహాయంతో శరీర అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. ఒకవేళ శరీరంలో విటమిన్ల లోపం ఉంటే ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. రకరకాల వ్యాధులకి గురికావాల్సి ఉంటుంది. అయితే శరీరంలో విటమిన్ లోపానికి సంబంధించిన లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

చిగుళ్ల నుంచి రక్తస్రావం

చిగుళ్లలో రక్తస్రావం కావడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈరోజుల్లో ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. ఇది విటమిన్ సి లోపం వల్ల జరుగుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. మీరు నారింజ, నిమ్మకాయ, సిట్రస్‌ జాతికి సంబంధించిన పండ్లని ఎక్కువగా తీసుకోవాలి.

నోటిలో పొక్కులు

నోటిలో పొక్కులు వస్తే ఆహారం తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సాధారణంగా ఇది విటమిన్ B12, ఐరన్ లోపం వల్ల జరుగుతుంది. దీని కోసం మీరు కొవ్వు చేపలు, బలవర్థకమైన తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది.

రేచీకటి

కొంతమందికి రాత్రిపూట కళ్లు కనిపించవు. ఈ వ్యాధిని రేచీకటి అంటారు. ఆహారంలో విటమిన్ ఎ ఆధారిత ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనిని నివారించాలంటే పాలకూర, బొప్పాయి, క్యారెట్‌ ఎక్కువగా తీసుకోవాలి.

బలహీనమైన గోర్లు, జుట్టు

శరీరంలో విటమిన్ల లోపం ఉంటే అది అందాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. గోర్లు, వెంట్రుకలు మునుపటి కంటే బలహీనంగా మారుతాయి. గోర్లు సులభంగా విరిగిపోతాయి. బట్టతల సమస్య కూడా రావొచ్చు.

Tags:    

Similar News