COVID 19: కోవిడ్ సోకిన చిన్నారుల్లో టైప్-1 డయాబెటిస్ లక్షణాలు

COVID 19: కోవిడ్ బారినపడ్డ చిన్నారుల్లో టైప్ 1 డయాబెటిస్ సంబంధించిన లక్షణాలు త్వరగా బయటపడతాయని జర్మన్ శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Update: 2024-07-17 12:03 GMT

Symptoms of type-1 diabetes in children infected with covid

COVID 19:కరోనా బారినపడిన చిన్నపిల్లల్లో టైప్ 1 మధుమేహానికి సంబంధించిన లక్షణాలు తొందరగా బయటపడతాయని తాజా అధ్యయనం పేర్కొంది. కోవిడ్ ఉధ్రుతంగా ఉన్న సమయంలో చిన్నారుల్లో ఈ వ్యాధి నిర్ధరణ రేటు చాలా ఎక్కువగా ఉందని జర్మనీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ రీసెర్చ్ కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

డయాబెటిస్ ఎలా వస్తుంది?

టైప్ 1 డయాబెటిస్ అనేది ఆటో ఇమ్యూన్ రుగ్మత. దీనిని సింపుల్ గా వివరించి చెప్పాలంటే వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించాల్సిన ఇమ్యూనిటీ వ్యవస్థ అదపు తప్పి ఆరోగ్యంగా ఉన్న స్వీయ కణాలు, అవయవాలపై దాడి చేస్తుంది. ఇలాంటి వారిలో అసాధారణ స్థాయిలో దాహం, ఆకలి, తరచూ మూత్రవిసర్జన చేయడం, తీవ్ర అలసట, దృష్టి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరికి చికిత్స కోసం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. క్లోమంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతిన్నప్పుడు ఐలెట్ లో ఆటో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. రక్త  నమూనాలో వీటి ఉనికి ఆధారంగా టైప్ 1 డయాబెటిస్ ను వైద్యులు గుర్తిస్తారు.

కోవిడ్ 19 బారినపడిన చిన్నారుల్లో ఈ ఐలెట్ ఆటో యాంటీబాడీల స్థాయి అధికంగా ఉన్నట్లు ఇంతకుముందు చేసిన పరిశోధనల్లో కూడా వెల్లడయ్యింది. తాజాగా జర్మన్ శాస్త్రవేత్తలు మరో అంశాన్ని గుర్తించారు. ఐలెట్ ఆటోయాంటీ బాడీలు ఇప్పటికే కలిగిన చిన్నారులు కోవిడ్ బారినపడితే వారిలో టైప్ 1 షుగర్ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా బయటపడే అవకాశం ఉంటుందని కనుగొన్నారు. కలుషితమైన గాలి పీల్చుకోవడం వల్ల కూడా షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఈమధ్యే చేసిన అధ్యయనాల్లో తెలిసింది. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెల్లడయ్యింది.

Tags:    

Similar News