Sunlight: చలికాలంలో సూర్యరశ్మి చాలా ముఖ్యం.. లేదంటే ఈ వ్యాధుల బారినపడుతారు..!

Sunlight: చలికాలంలో ప్రతి ఒక్కరూ సూర్యరశ్మి తీసుకోవాలి. వెచ్చటి సూర్యకాంతి శరీరానికి వెచ్చదనాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

Update: 2023-11-27 01:30 GMT

Sunlight: చలికాలంలో సూర్యరశ్మి చాలా ముఖ్యం.. లేదంటే ఈ వ్యాధుల బారినపడుతారు..!

Sunlight: చలికాలంలో ప్రతి ఒక్కరూ సూర్యరశ్మి తీసుకోవాలి. వెచ్చటి సూర్యకాంతి శరీరానికి వెచ్చదనాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కి సూర్యరశ్మి అంతే అవసరం. ఆహారం నుంచి శక్తిని పొందితే, సూర్యకాంతి నుంచి విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముకల పెరుగుదల, బలానికి అవసరమవుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. శీతాకాలంలో ప్రతిరోజూ కొంత సమయం సూర్యరశ్మిలో గడపడం అవసరం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

విటమిన్ డి

విటమిన్ డి సూర్యకాంతి నుంచి లభిస్తుంది. వాస్తవానికి మన శరీరం సూర్యరశ్మికి గురైనప్పుడు విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎముకలకు చాలాముఖ్యమైనది. ఎందుకంటే ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. విటమిన్ డి లోపం కారణంగా ఎముకలు త్వరగా విరిగిపోయే ప్రమాదం పెరుగుతుంది.

వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది

సూర్యరశ్మి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని కారణంగా శరీరం వివిధ రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పూట కొద్దిసేపు ఎండలో ఉండాలి.

మానసిక స్థితి మెరుగు

సూర్యకాంతిలో ఉండటం వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. ఈ హార్మోన్లు శరీరం, మనస్సును రిలాక్స్ చేస్తాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. సూర్యకాంతిలో ఉండడం వల్ల మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది.

చర్మానికి ప్రయోజనాలు

చలికాలంలో ఎండలో ఉండడం వల్ల ముఖం మెరుస్తుంది. సూర్యకాంతిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను దూరం చేస్తాయి.

బరువు తగ్గుతారు

సూర్యరశ్మిని తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు బర్న్‌ అవుతాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. సూర్యరశ్మి నుంచి విటమిన్ డి పొందాలంటే ఉదయం 8 గంటలలోపు ఎండలో ఉండాలి. ఈ సమయంలో 10 నిమిషాలు సూర్యరశ్మిని తీసుకుంటే సరిపోతుంది.

Tags:    

Similar News