Summer Diet Plan: ఎండాకాలం ఈ డ్రై ఫ్రూట్స్ బెస్ట్.. ఈ రుగ్మతలు దరిచేరవు..!
Summer Diet Plan: వేసవికాలం వచ్చేసింది. డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. లేదంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గి సీజనల్ వ్యాధులకు గురవుతాం.
Summer Diet Plan: వేసవికాలం వచ్చేసింది. డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. లేదంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గి సీజనల్ వ్యాధులకు గురవుతాం. వేసవిలో ఐదు రకాల డ్రై ఫ్రూట్స్‌ను కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధులకు గురికాకుండా ఉంటాం. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
బాదం: బాదంపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రోగనిరోధక పనితీరుకు సపోర్ట్ చేస్తుంది. వీటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
వాల్‌నట్‌లు: వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లకు మంచి మూలం. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కణాల పెరుగుదల, రిపేర్‌కు అవసరమైన జింక్, రోగనిరోధక కణాల ఉత్పత్తికి తోడ్పడే విటమిన్ B6 ఉంటుంది.
ఎండుద్రాక్ష: ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వీటలో ఫైబర్ ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్‌తో పోరాడి రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తుంది.
జీడిపప్పు: జీడిపప్పులో జింక్, విటమిన్ సి, కాపర్ ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కణాల పెరుగుదల, రిపేర్ కోసం జింక్ అవసరం. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ఖర్జూరాలు: ఎండిన ఖర్జూరాలు పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్‌లతో సహా యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తాయి. వాటిలో ఫైబర్, పొటాషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇవన్నీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి.