Womens Health: పీసీఓఎస్‌తో బాధపడుతున్న మహిళల శరీరంలో ఈ మార్పులు సంభవిస్తాయి.. అవేంటంటే..?

Womens Health: నేటి రోజుల్లో మహిళలు చాలా రకాల రోగాలకు గురవుతున్నారు. అందులో ఒకటి పీసీఓఎస్‌.

Update: 2024-03-16 16:00 GMT

Womens Health: పీసీఓఎస్‌తో బాధపడుతున్న మహిళల శరీరంలో ఈ మార్పులు సంభవిస్తాయి.. అవేంటంటే..?

Womens Health: నేటి రోజుల్లో మహిళలు చాలా రకాల రోగాలకు గురవుతున్నారు. అందులో ఒకటి పీసీఓఎస్‌. దీనినే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని పిలుస్తారు. WHO ప్రకారం ప్రపంచ జనాభాలో 8 నుంచి 13 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. భారతదేశంలో 10 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వారి బాడీలో చాలా మార్పులు సంభవిస్తాయి. వాటిని ముందుగానే తెలుసుకొని చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

పీసీఓఎస్‌తో బాధపడుతున్న మహిళల్లో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. వారికి రుతుక్రమం సక్రమంగా ఉండదు. అంతేకాకుండా సడెన్‌గా 5 కిలోల వరకు బరువు పెరుగుతారు. రాత్రిపూట దుస్తులు టైట్‌ అయినట్లు అనిపిస్తుంది. అంతేకాదు దీర్ఘకాలికంగా మొటిమల సమస్య వేధిస్తుంది. ఇలాంటి సమయంలో వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించి లుటినైజింగ్ హార్మోన్ (LH) టెస్ట్‌ చేయించుకోవాలి. అలాగే స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH), టెస్టోస్టెరాన్ పరీక్షలు కూడా చేయించుకోవాలి.

పీసీఓఎస్‌ రోగుల డైట్‌

పీసీఓఎస్‌కు గురైన మహిళలు బ్రోకలీ, క్యాలీఫ్లవర్, మొలకలు, బీన్స్, కాయధాన్యాలు, బాదం, చిలగడదుంపలు, గుమ్మడికాయ వంటి అధిక ఫైబర్ ఆహారాలను తీసుకోవాలి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి ఇన్సులిన్ నిరోధకతతో పోరాడుతాయి. ఇవి కాకుండా, టమోటాలు, బచ్చలికూర, ఆలివ్ నూనె, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు వంటి ఆహారాలు, సాల్మన్, సార్డినెస్ వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు తినవచ్చు.

ఇవి తినకూడదు.

పీసీఓఎస్‌తో బాధపడుతున్న మహిళలు మఫిన్‌లు, డెజర్ట్‌లు, పేస్ట్రీలు, పాస్తా నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్, వనస్పతి, రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, కార్బోహైడ్రేట్‌లు ఎక్కువగా ఉండే సోడా వంటి పానీయాలు, తక్కువ పీచు కలిగిన కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజువారీ వ్యాయామం, తక్కువ చక్కెర ఆహారం, యోగా, ధ్యానం వంటి ఒత్తిడిని తగ్గించే వాటిని పాటించాలి.

Tags:    

Similar News