Health Tips: టీకి బదులుగా ఈ ఆహారాలతో రోజు ప్రారంభించండి.. అద్భుత ప్రయోజనాలు..!
Health Tips: టీకి బదులుగా ఈ ఆహారాలతో రోజు ప్రారంభించండి.. అద్భుత ప్రయోజనాలు..!
Health Tips: దేశంలోని చాలామంది ప్రజలు టీతో రోజుని ప్రారంభిస్తారు. చాలామంది వ్యక్తులు దీనికి అలవాటు పడ్డారు. తాగకుండా ఉండలేరు. లేదంటే తలనొప్పి మొదలవుతుంది. పోషకాహార నిపుణులు టీకి బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలతో రోజు ప్రారంభించమని చెబుతున్నారు. అందులో నానబెట్టిన బాదం, నానబెట్టిన ఎండుద్రాక్ష, అరటిపండ్ల వంటివి ఉన్నాయి. వీటిని ఏ విధంగా తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.
అరటిపండు: జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు లేదా చక్కెర కోరికలతో సతమతమయ్యేవారు అల్పాహారానికి ముందు అరటిపండు తినాలి. వారానికి 2 నుంచి 3 సార్లు తినాలి. వీటిని ప్లాస్టిక్ సంచుల్లో తీసుకురావద్దు.
ఎండు ద్రాక్ష: ప్రతిరోజూ కనీసం 6 నుంచి 7 నానబెట్టిన ఎండుద్రాక్షలను తినాలని నిపుణులు చెబుతున్నారు. పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు ఉన్న మహిళలు రెండు కుంకుమపువ్వుతో పాటు ఎండు ద్రాక్షలను నానబెట్టి తిని ఆ నీటిని తాగాలి.
బాదం: ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం, పీసీఓడీ లేదా నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజూ కనీసం 4 నుంచి 5 నానబెట్టిన బాదంపప్పులను తినాలి. మంచి ఫలితాలు ఉంటాయి.
మీరు టీకి అలవాటు పడినట్లయితే అల్పాహారానికి 15 నిమిషాల ముందు వీటిని తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తిన్న 15 నుంచి 20 నిమిషాల తర్వాత శారీరక శ్రమ చేయాలి. ఎండుద్రాక్ష నీరు తాగవచ్చు. కానీ బాదం నీరు తాగవద్దు. అరటిపండ్లు ఇష్టం లేకుంటే సీజనల్ ఫ్రూట్స్ తినాలని సూచించారు.