Health: రాత్రిపూట లైట్ వేసుకొని నిద్రిస్తున్నారా.. అయితే కష్టమే..!

Health: చాలామంది రాత్రిపూట లైట్లు ఆఫ్ చేసి నిద్రపోవడం అలవాటు. కానీ కొంతమంది మాత్రం లైట్లు వేసుకొని నిద్రిస్తారు.

Update: 2022-03-24 15:30 GMT

Representational image

Health: చాలామంది రాత్రిపూట లైట్లు ఆఫ్ చేసి నిద్రపోవడం అలవాటు. కానీ కొంతమంది మాత్రం లైట్లు వేసుకొని నిద్రిస్తారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలని చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. కొంతమంది భయం వల్ల రాత్రంతా లైట్లు వేసుకుని నిద్రపోతారు. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన ఫీన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు దీని గురించి ఒక అధ్యయనం చేశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.

రాత్రిపూట లైట్లు వెలిగించి నిద్రించడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. వెలుతురులో నిద్రపోవడం వల్ల గుండె కొట్టుకోవడం రోజు రోజుకి పెరుగుతుందని గమనించారు. శరీరంలోని ఇన్సులిన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. దాదాపు 20 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చాలామందిలో హృదయ స్పందన రేటు విపరీతంగా పెరుగుతున్నట్లు పరోశోధకులు గుర్తించారు. నిద్రపోయిన తర్వాత కూడా మన అటానమిక్ నాడీ వ్యవస్థ రాత్రిపూట కూడా చురుకుగా ఉంటుంది కాబట్టి ఇలా జరుగుతుందని చెబుతున్నారు.

ప్రకాశవంతమైన కాంతిలో నిద్రించే వారిలో ఇన్సులిన్ 15 శాతం వరకు పెరుగుతుంది. అదే సమయంలో తక్కువ వెలుతురులో నిద్రపోయేవారిలో ఇన్సులిన్ 4 శాతం తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీలోని స్లీప్ మెడిసిన్ హెడ్ డాక్టర్ ఫిల్లిస్ జీ ప్రకారం.. మనం కాంతిలో నిద్రించేటప్పుడు వస్తువులను సులభంగా చూడగలుగుతాం. అది శరీరానికి ప్రాణాంతకం. వెలుతురు లేకుండా లేదా లేత పసుపు కాంతిలో నిద్రించడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు.

ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది. వీటిని పాటించేముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. hmtv దీన్ని ధృవీకరించదని గుర్తుంచుకోండి. 

Tags:    

Similar News