Health Tips: 40 ఏళ్లు దాటాయంటే నిద్ర రుగ్మతలు.. ఈ అలవాట్లు మార్చుకోపోతే ఇబ్బందులు..!
Health Tips: 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే అనేక వ్యాధులకి గురవుతారు.
Health Tips: 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే అనేక వ్యాధులకి గురవుతారు. ముఖ్యంగా ఈ వయసులో కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనివల్ల త్వరగా అలసిపోతారు. ఇలాంటి సమయంలో సరైన నిద్ర అవసరం. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యవంతమైన పెద్దలు ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు చెబుతున్నారు. అయితే 40 ఏళ్లు దాటిన వ్యక్తులు మంచి నిద్ర పొందాలంటు ఎలాంటి అలవాట్లు పాటించాలో ఈరోజు తెలుసుకుందాం.
గోరు వెచ్చని నీటితో స్నానం
మంచి నిద్ర పొందడానికి సాయంత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి. దీనివల్ల కాస్త అలసట వదిలి శరీరం తేలికవుతుంది. మంచి గాడైన నిద్ర పడుతుంది.
మనస్సు ప్రశాంతం
40 సంవత్సరాలు దాటిన వారు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ వయసులో కుటుంబ బాధ్యతల భారం పెరుగుతుంది. దీనివల్ల ఒత్తిడికి గురవుతారు. ఈ టెన్షన్ రాత్రిపూట ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా సరిగ్గా నిద్రపోలేరు. ఇలాంటి సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే 8 గంటల పాటు హాయిగా నిద్రపోగలరు.
ధ్యానం అలవాటు
యోగాలో ధ్యానం ఒక ముఖ్యభాగం. దీనివల్ల టెన్షన్, ఆందోళనను దూరం చేయవచ్చు. ఇందుకోసం యోగా నిపుణుల సహాయం తీసుకోవచ్చు. కొన్ని రోజుల సాధన తర్వాత ప్రశాంతంగా నిద్రపోవడం అలవాటు అవుతుంది.
రాత్రిపూట టీ తాగవద్దు
టీ తాగడం వల్ల అలసట తొలగిపోయి తాజాదనం వస్తుంది. రాత్రిపూట టీ తాగడం వల్ల నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ మీరు టీ తాగకుండా ఉండలేకపోతే సాయంత్రం తాగండి. రాత్రిపూట మాత్రం టీ తాగవద్దు.