Health Tips: చలికాలంలో ఈ ఒక్కటి తింటే సీజనల్‌ వ్యాధులు దరిచేరవు..!

Health Tips: చలికాలం అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, కఫం వంటి వ్యాధులు నిత్యం ఉంటూనే ఉంటాయి.

Update: 2022-11-15 01:54 GMT

Health Tips: చలికాలంలో ఈ ఒక్కటి తింటే సీజనల్‌ వ్యాధులు దరిచేరవు..!

Health Tips: చలికాలం అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, కఫం వంటి వ్యాధులు నిత్యం ఉంటూనే ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి వ్యాధులు సంభవిస్తాయి. దీంతో పాటు బ్యాక్టీరియా, వైరస్లు కూడా వ్యాప్తి చెందుతాయి. ఇవి వివిధ వ్యాధులకు కారణం అవుతాయి. ఈ రోజుల్లో వ్యాధులు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. డైట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు చేర్చుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

శీతాకాలం సూపర్ ఫుడ్స్‌

శీతాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలంటే అంజీర్ పండ్లను తినడం చాలా ముఖ్యం. అంజీర్ ఒక సూపర్ ఫుడ్. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే ఈ సీజన్‌లో అంజీర పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు అంజీర్‌లో సమృద్దిగా ఉంటాయి. అత్తి పండ్లలో ఫైబర్, ప్రోటీన్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు A, B పుష్కలంగా ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి అనేక వ్యాధులను దూరంగా ఉంచడానికి ఇది పనిచేస్తుంది.

చలి దూరం

అత్తి పండ్లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. చలికాలంలో అత్తి పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి. అత్తి పండ్లను తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది.

దగ్గు

అత్తి పండ్లలో ఉండే పోషకాలు శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తాయి. విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం వంటి ఖనిజాలు అంజీర్‌లో ఉంటాయి. చలికాలంలో అంజీర పండ్లను తీసుకోవడం వల్ల కఫం, గొంతు నొప్పి తొలగిపోతాయి. ఇది దగ్గు సమస్యను దూరం చేస్తుంది.

చర్మానికి ప్రయోజనకరం

చలికాలంలో చర్మం పొడిబారుతుంది. అంజీర్ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా మార్చడానికి పని చేస్తాయి. పొడి చర్మం వదిలించుకోవడానికి అత్తి పండ్లను తీసుకుంటే మంచిది.

Tags:    

Similar News