Health Tips: చిన్న వయసులో అధిక కొలస్ట్రాల్ ప్రమాదం.. ఈ లక్షణాలు విస్మరించవద్దు..!
Health Tips: చెడు కొలస్ట్రాల్ ఆరోగ్యానికి పెద్ద శత్రువు. గతంలో ఈ సమస్యను మధ్య వయసువారు ఎదుర్కొనేవారు.
Health Tips: చెడు కొలస్ట్రాల్ ఆరోగ్యానికి పెద్ద శత్రువు. గతంలో ఈ సమస్యను మధ్య వయసువారు ఎదుర్కొనేవారు. దీనివల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ గత కొద్దికాలంగా చాలా మంది యువకులు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, హై బీపీ బారిన పడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. అందుకే శరీరంలో పెరుగుతున్న LDL లక్షణాలను గుర్తించడం ముఖ్యం. వీటిని విస్మరిస్తే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అధిక కొలెస్ట్రాల్ లక్షణాల గురించి తెలుసుకుందాం.
1. చెమటలు పట్టడం
వేసవి కాలంలో చెమటలు పట్టడం సహజం. అయితే సాధారణ గది ఉష్ణోగ్రత లేదా చలికాలంలో నుదుటిపై నుంచి చెమటలు పడుతుంటే ఆలోచించాల్సిన విషయం. వాస్తవానికి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్తం గుండెకు చేరదు. దీని కారణంగా అనవసరమైన చెమట మొదలవుతుంది.
2. శ్వాస ఆడకపోవడం
మీ వయస్సు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటే మీరు శారీరక శ్రమలు చేయడంలో ఇబ్బంది పడకూడదు. కానీ కొంతమంది యువకులు 2వ అంతస్తు వరకు కూడా మెట్లు ఎక్కలేరు. ఈ సమయంలో వారు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. హృదయ స్పందన చాలా వేగంగా మారుతుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ హెచ్చరిక అని చెప్పవచ్చు.
3. కళ్ల చుట్టూ మచ్చలు
కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగినప్పుడు కళ్ల చుట్టూ ఉన్న చర్మం పసుపు రంగులోకి మారుతుంది. లేదా పసుపు దద్దుర్లు వస్తాయి. రక్తంలో అధిక కొవ్వు పెరుగుదల కారణంగా ఇది జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది.
4. శరీర భాగాలలో నొప్పులు
అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త సిరల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీని కారణంగా శరీరంలోని అనేక భాగాలలో రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది. ఈ పరిస్థితిలో మీరు కాళ్ళు, మెడ, చేతులు, దవడలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు.
అధిక కొలెస్ట్రాల్
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు చాలా తీవ్రతరం అయినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. వీటిని నివారించడానికి మీరు క్రమమైన వ్యవధిలో లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి, దీనిలో రక్త నమూనా తీసుకుంటారు. ఇది కొవ్వు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా చూపుతుంది. ఈ విధంగా ప్రమాదం పెరగకముందే ఆపవచ్చు.