Kidney Disease: కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు గుర్తించండి.. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం..!

Kidney Disease: మానవ శరీరంలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైన అవయవాలు.

Update: 2023-08-16 13:30 GMT

Kidney Disease: కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు గుర్తించండి.. లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదం..!

Kidney Disease: మానవ శరీరంలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి శరీరంలోని అన్ని మలినాలని బయటికి పంపిస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. వీటికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అనారోగ్యానికి గురవుతాం. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మెషిన్ ద్వారా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళుతాయి. అతి పెద్ద సమస్య ఏంటంటే కిడ్నీ వ్యాధి ఆలస్యంగా బయటపడుతుంది. అయితే కొన్ని ప్రారంభ లక్షణాల ద్వారా మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని గుర్తించవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

మూత్రం రంగు మారడం

శరీరంలో ఉండే ద్రవాలను ఫిల్టర్ చేయడమే కిడ్నీ పని. దీని పనితీరులో ఏదైనా సమస్య ఏర్పడితే మూత్రం రంగులో తేడా కనిపిస్తుంది. మూత్రం రంగు ముదురు పసుపు, మూత్రంలో నురుగు, తరచుగా మూత్రవిసర్జన జరుగుతాయి. ఈ పరిస్థితిలో వెంటనే మూత్రపిండాల పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

అలసట

కిడ్నీ సమస్య వల్ల శరీరంలో ఐరన్‌తో పాటు అనేక రకాల పోషకాల లోపం ఏర్పడుతుంది. దీంతో పాటు ఎర్ర రక్త కణాలు కూడా తగ్గుతాయి. ఇవి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెయింటెన్‌ చేసే కణాలు. RBCలు లేకపోవడం వల్ల అలసటను ఎదుర్కోవలసి వస్తుంది.

నోటి దుర్వాసన

తరచుగా దంతాలు శుభ్రం చేయకపోవడం, ఉల్లిపాయ-వెల్లుల్లి తినడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కానీ ఇలాంటివి ఏమి చేయకుండా నోటి దుర్వాసన వస్తే అప్రమత్తంగా ఉండాలి. ఇవి కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు.

చర్మ వ్యాధి

కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం వల్ల శరీరంలో మలినాలు పేరుకుపోతాయి. దీని ప్రభావం చర్మంపై కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదం పెరుగుతుంది. అలాగే శరీరం ముఖంపై దద్దుర్లు కనిపిస్తాయి.

Tags:    

Similar News