Health Tips: చలికాలంలో పైల్స్ సమస్య వేధిస్తుందా.. ఇలా నివారించండి..!
* వింటర్ సీజన్‌లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Health Tips: పైల్స్ అనేది ఒక సాధారణ సమస్య. ఇది తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. చాలా సందర్భాలలో ఇది దానంతట అదే మెరుగుపడుతుంది. కానీ ఒక్కోసారి మలద్వారం చుట్టూ దురద, మలవిసర్జనతో రక్తస్రావం, భరించలేని నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి సందర్బంలో తక్షణ చికిత్స అవసరం. వింటర్ సీజన్‌లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
1. ఫైబర్ ఫుడ్స్
ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి మాత్రమే కాదు పేగు కదలికలను నియంత్రించడం ద్వారా పైల్స్ సమస్యని తొలగిస్తుంది. రోజువారీ ఆహారంలో ఫైబర్ ఉండాలి. పీచు పదార్థాలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇది కాకుండా నీరు పుష్కలంగా తాగాలి.
2. స్పైసీ ఫుడ్
పైల్స్ రోగులకి స్పైసీ ఫుడ్ అతిపెద్ద శత్రువు. ఇది జీర్ణక్రియను పాడుచేయడమే కాకుండా పేగు కదలికల మార్గంలో సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా ఎర్ర మిరప పొడికి వీలైనంత దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది ప్రేగులకు అంటుకొని చికాకు పెంచుతుంది. ఆహారంలో స్పైసీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే పైల్స్ సమస్య అంత తగ్గుతుంది.
3. టాయిలెట్‌కి వెళ్లడం
చాలా సార్లు మనం ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నప్పుడు, లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు, తరచుగా మూత్ర విసర్జన చేయడం లేదా ప్రేగు కదలికలను ఆలస్యం చేయడం చేస్తాం. ఇది చాలా చెడ్డ అలవాటు. ముఖ్యంగా పైల్స్ ఉన్నవారిలో వారి మల కండరాలు వదులుగా మారుతాయి. ఇది అసౌకర్యాన్ని పెంచుతుంది. అందుకే టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. దీనివల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి.