Health Tips: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరి తినకూడదు.. ఆస్పత్రి పాలవుతారు..!
Health Tips: ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అద్భుత ఔషధగుణాలు దాగి ఉన్నాయి. చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం లభిస్తుంది.
Health Tips: ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అద్భుత ఔషధగుణాలు దాగి ఉన్నాయి. చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే ఉసిరి ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అధిక మొత్తంలో సోడియం, పొటాషియం కలిగి ఉంటుంది. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదు. అయితే ఎవరెవరు తినకూడదో ఈరోజు తెలుసుకుందాం.
అసిడిటీ సమస్య ఉన్నవారు
ఉసిరికాయలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అసిడిటీతో బాధపడుతుంటే ఉసిరి పరిమితంగా తినాలి.
కిడ్నీ వ్యాధులున్నవారు
కిడ్నీ వ్యాధితో బాధపడేవారు ఉసిరికాయను అస్సలు తినకూడదు. మూత్రపిండాల రోగులు ఉసిరిని తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది. వాటి పనితీరుపై ప్రభావం పడుతుంది.
లో బీపీ పేషెంట్లు
ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. లో బీపీతో బాధపడే వ్యక్తులు ఉసిరిని తినకూడదు. అలాగే యాంటీ డయాబెటిక్ మందులు వేసుకునే వారు కూడా ఉసిరికాయ తినకూడదు.
గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు
గర్భిణీలు, పాలిచ్చే మహిళలు ఉసిరి తినేముందు డాక్టరును సంప్రదించాలి. లేదంటే డీహైడ్రేషన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు.
శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన వారు
భవిష్యత్తులో శస్త్ర చికిత్స చేయించుకోబోయే వారు ఉసిరికాయ తినకూడదు. దీన్ని తీసుకోవడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. శస్త్రచికిత్సకు కనీసం 2 వారాల ముందు ఆమ్లా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.