Coffee Effects: ఈ వ్యాధులతో బాధపడుతున్నవారు పొరపాటున కూడా కాఫీ తాగకూడదు..!
Coffee Effects: చాలామందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. చాలామంది వీటిని గుర్తించడం లేదు.
Coffee Effects: చాలామందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. చాలామంది వీటిని గుర్తించడం లేదు. సాధారణంగా 5 రకాల వ్యాధులతో బాధపడేవారు పొరపాటున కూడా కాఫీ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల వ్యాధుల ప్రమాదం మరింత పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆ వ్యాధుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
మానసిక సమస్యలు
మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కాఫీ తాగడం హానికరం. దీనివల్ల వారు మరింత అశాంతికి గురవుతారు. ఇది తీవ్ర భయాందోళనలకు దారితీస్తుంది. అధిక వినియోగం మానసిక ఒత్తిడిని పెంచుతుంది.
గర్భధారణ సమయంలో
గర్భధారణ సమయంలో కాఫీ తీసుకోవడం మానేయాలి. వైద్యుల ప్రకారం కాఫీ ఎక్కువగా తాగడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. ఇది గర్భంలో పిండం అభివృద్ధిలో సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా మిస్ క్యారేజ్ సంభవించే అవకాశాలు ఉన్నాయి.
మైగ్రేన్ సమస్య
మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు కాఫీ తీసుకోకుండా ఉండాలి. దీనికి కారణం కాఫీలో ఉండే కెఫిన్ మెదడులోని నరాలలో అడ్డంకిని కలిగిస్తుంది. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. మైగ్రేన్ సమస్య మరింత పెరుగుతుంది.
బోలు ఎముకల వ్యాధి
బోలు ఎముకల వ్యాధి వచ్చినప్పుడు ఎముకలు క్రమంగా బలహీనపడుతాయి. తొందరగా విరిగిపోతాయి. కాల్షియం లోపం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని కాల్షియంను బయటికి పంపిస్తుంది. కాబట్టి కాఫీని తాగడం మానుకోవాలి.
అధిక రక్తపోటు
నేడు అధిక రక్తపోటు వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధిగా మారుతోంది. ఎవరికైనా హై బీపీ సమస్య ఉంటే కాఫీ తాగడం మానేయాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో పాటు నిద్రలేమి, గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి.