Health Tips: ఈ గింజలలో పోషకాలు పుష్కలం.. డైట్‌లో ఉంటే అనేక వ్యాధులు దూరం..!

Health Tips: ఈ గింజలలో పోషకాలు పుష్కలం.. డైట్‌లో ఉంటే అనేక వ్యాధులు దూరం..!

Update: 2023-01-08 07:45 GMT

Health Tips: ఈ గింజలలో పోషకాలు పుష్కలం.. డైట్‌లో ఉంటే అనేక వ్యాధులు దూరం..!

Health Tips: విత్తనాలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రోటీన్, ఫైబర్, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, అనేక ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే అనేక రోగాలని దూరం చేసుకోవచ్చు. అలాంటి విత్తనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

చియా విత్తనాలు

చియా విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా సీడ్స్ తినడం వల్ల బరువు తగ్గుతారు. వీటి వినియోగం మధుమేహం, గుండె జబ్బులకు మేలు చేస్తుంది.

అవిసె గింజలు

రక్తపోటును నియంత్రించడంలో అవిసె గింజలు చాలా మేలు చేస్తాయి. పొటాషియం, పీచు, ప్రొటీన్ వంటి పోషకాలు ఈ గింజల్లో పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి అవిసె గింజలు పనిచేస్తాయి.

క్వినోవా విత్తనాలు

క్వినోవా అనేది ప్రొటీన్లు అధికంగా ఉండే విత్తనం. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఫైబర్, ఐరన్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి.

గుమ్మడికాయ గింజలు

మీరు గుమ్మడికాయ కూరను చాలాసార్లు తినే ఉంటారు. దీని గింజలను ఆహారంలో ఉపయోగిస్తారు. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్పరస్ ఉంటాయి. గుమ్మడి గింజల వినియోగం చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు

పొద్దుతిరుగుడు విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఈ, ఐరన్, కాల్షియం, జింక్ వంటి మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయి.

Tags:    

Similar News