Drumsticks Benefits: మునక్కాడలో పోషకాలు పుష్కలం.. షుగర్‌తో పాటు ఈ వ్యాధులన్ని దూరం..!
Drumsticks Benefits:మునక్కాడలో పోషకాలు పుష్కలం.. షుగర్‌తో పాటు ఈ వ్యాధులన్ని దూరం..!
Drumsticks Benefits: మునగలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మునగ చెట్టు ఆకులు,కాయలని కూరలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు అనేక వ్యాధులను నయం చేస్తాయి. మునగకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
మధుమేహం నియంత్రణ:
మునక్కాడలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మునగ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది.
రక్తపోటు నియంత్రణ:
అధిక రక్తపోటు ఉన్న రోగులకు మునక్కాయ చాలా మేలు చేస్తుంది. మునగలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందిర. రక్తపోటును పెంచదు.
గుండెకు ప్రయోజనకరం:
మునగలో ఉండే పోషకాలు రక్తనాళాలలో చెడు కొలస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తాయి. దీన్ని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
చర్మానికి మెరుపు:
మునగ చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. మునగలో ఉండే పోషకాలు మొటిమలను తొలగించడానికి పని చేస్తాయి.
థైరాయిడ్ కంట్రోల్:
ములక్కాడ తినడం వల్ల థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. మునగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపు సమస్యలని దూరం చేస్తాయి.