Frozen Foods: గడ్డ కట్టిన ఆహారాలు ఎప్పుడు తినకండి.. చాలా ప్రమాదకరం..

Frozen Foods: కొంతమంది గడ్డకట్టిన ఆహారాలను ఎంతో ఇష్టంతో తింటారు. ఇది చాలా ప్రమాదకరం.

Update: 2021-12-30 03:30 GMT

 గడ్డ కట్టిన ఆహారాలు ఎప్పుడు తినకండి.. చాలా ప్రమాదకరం..

Frozen Foods: కొంతమంది గడ్డకట్టిన ఆహారాలను ఎంతో ఇష్టంతో తింటారు. ఇది చాలా ప్రమాదకరం. తినేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత దాని ఎఫెక్ట్‌ చూపిస్తుంది. మెరుగైన జీవనశైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి కానీ బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ప్రజలు సరైన దినచర్యను అనుసరించడం లేదు. కొంతమంది ఒంటరిగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదు. తద్వారా స్తంభింపచేసిన వాటిని తినవలసి వస్తుంది. నిజానికి చాలా ఆహారపదార్థాలు కొంతకాలం నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. బోలెడన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

ఘనీభవించిన ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. రిపోర్టుల ప్రకారం.. ఫ్రోజెన్ హాట్ డాగ్స్, నాన్ వెజ్, ఇతర వాటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65 శాతం ఉంది. అంతే కాదు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కూడా కారణమవుతుంది. కాబట్టి ఈరోజే ఫ్రోజెన్ ఫుడ్స్ తీసుకోవడం మానేయ్యండి.

సాధారణ ఆహారాలతో పోలిస్తే స్తంభింపచేసిన ఆహారాలలో రెండు రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వస్తాయి. ఘనీభవించిన ఆహారాలలో స్టార్చ్ ఉపయోగిస్తారు. ఇది రుచిగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతే కాదు దీని వల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Tags:    

Similar News