Health Tips: గ్రీన్ టీని ఎప్పుడు ఇలా తాగవద్దు.. చాలా బాధపడుతారు..!
Health Tips: గ్రీన్ టీని ఎప్పుడు ఇలా తాగవద్దు.. చాలా బాధపడుతారు..!
Health Tips: ఈ రోజుల్లో బరువు తగ్గడానికి జనాలు అనేక పద్ధతులు అవలంభిస్తున్నారు. ఖరీదైన డైట్ ప్లాన్‌ల నుంచి వర్కవుట్ చిట్కాల వరకు అన్ని పద్దతులని అనుసరిస్తున్నారు. వీటిలో ఒకటి గ్రీన్ టీ. ఇది బరువు తగ్గించే ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా మారింది. గ్రీన్ టీ ప్రయోజనాలకు బదులుగా హాని కూడా కలిగిస్తుంది. ఈ హెల్తీ డ్రింక్ వల్ల శరీరంలో పోషకాల లోపం నుంచి చర్మంపై అలర్జీలు ఏర్పడతాయి. గ్రీన్ టీ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం.
గ్రీన్ టీ బరువును తగ్గించదు. అయితే ఇది ఖచ్చితంగా జీవక్రియకి ప్రయోజనం చేకూరుస్తుంది. గ్రీన్ టీని తప్పుగా తీసుకుంటే శరీరం చాలా నష్టపోవాల్సి ఉంటుంది. గ్రీన్ టీలో టానిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఐరన్‌ని సులభంగా గ్రహిస్తుంది. ఐరన్ మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అయితే మీరు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీని తాగితే రక్తహీనత సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
డీ హైడ్రేషన్, మలబద్దకం
గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా నీరు తాగాలి.
కాలేయ రుగ్మత
గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటే కాలేయం ఫెయిల్ అవుతుంది. అంతే కాదు ఎసిడిటీ సమస్య ఉన్నవారు గ్రీన్ టీని తక్కువగా తాగాలి. ఆందోళనతో బాధపడేవారు కూడా దీనికి దూరంగా ఉండటం మంచిది.