Face Glow: యవ్వనంగా కనిపించాలంటే ఈ ఆయిల్ ఒక్కటి చాలు..!
Face Glow: నేటి కాలంలో ప్రజలు అందంగా కనిపించడానికి ముఖ్యంపై ఉన్న మొటిమలని తొలగించడానికి మార్కెట్లో లభించే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్‌ని వాడుతున్నారు.
Face Glow: నేటి కాలంలో ప్రజలు అందంగా కనిపించడానికి ముఖ్యంపై ఉన్న మొటిమలని తొలగించడానికి మార్కెట్లో లభించే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్‌ని వాడుతున్నారు. అయితే వాటిలో చాలా రసాయనాలను కలిసి ఉంటాయి. అవి ప్రయోజనానికి బదులుగా చర్మానికి హాని చేస్తాయి. ముఖంపై సహజమైన కాంతిని తీసుకురావడానికి, మొటిమలను తొలగించడానికి రాత్రిపూట మస్టర్డ్ ఆయిల్ రాసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ ఉపయోగాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
పొడి చర్మాన్ని వదిలించుకోండి: ప్రాచీన కాలం నుంచి పొడి చర్మాన్ని తేమగా చేయడానికి మస్టర్డ్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు దీనిని ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తారు. ఇది చర్మం తేమను లాక్ చేస్తుంది. తద్వారా పోషణను అందిస్తుంది. పొడి చర్మం సమస్యను తొలగిస్తుంది.
మొటిమలకి చెక్: ఆవాల నూనెలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా ఇది ముఖంపై ఉండే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది. మస్టర్డ్ ఆయిల్ మొటిమలను తొలగించడంతో పాటు చర్మ గాయాలను త్వరగా నయం చేస్తుంది.
చర్మానికి సహజ మెరుపు: రాత్రి పడుకునే ముందు ఆవనూనెను ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం రంగు మెరుగుపడుతుంది. మస్టర్డ్ ఆయిల్ ముఖంపై టానింగ్, పిగ్మెంటేషన్, మచ్చలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని వల్ల ముఖంలో సహజసిద్దమైన మెరుపు కనిపిస్తుంది.
చర్మాన్ని టైట్ చేస్తుంది: ఆవాలనూనెను ముఖానికి రాసుకుంటే చాలా కాలం యవ్వనంగా కనిపించవచ్చు. మస్టర్డ్ ఆయిల్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది. ఇది ముడతలు, రంధ్రాలని తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.