Corona: హోం ఐసోలేషన్ పూర్తయ్యాక టూత్ బ్రెష్ లు ఎందుకు మార్చాలి

Corona: కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారు వెంటనే టూత్ బ్రష్ మార్చుకోవాలని దంతవైద్యులు సూచిస్తున్నారు

Update: 2021-05-08 06:33 GMT

టూత్ బ్రష్ (ఫైల్ ఇమేజ్)

Corona: పళ్ళు తోముకునే టూత్ బ్రష్ లు కూడా కరోనా కారకాలే అని మీకు తెలుసా? నిజమేనంట టూత్ బ్రెష్ లు, వాటి కోసం వాడే కంటైనర్ల ద్వారా కూడా కోవిడ్ వైరస్ కుటుంబంలో ఇతర సభ్యులకు చేరుతున్నట్లు యునైటెడ్ కింగ్ డమ్ నుంచి వెలువడిన బీఎంసీ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైంది. కోవిడ్ సోకిన వ్యక్తి టూత్ పేస్టును మిగతా కుటుంబ సభ్యులు వాడడం ద్వారా 33 శాతం ఇతరులకు వైరస్ సోకే ముప్పు ఉందని ఆ అధ్యయనంలో గుర్తించారని వైద్యులు తెలిపారు.ఒకవేళ మీరు కోవిద్ నుండి కోలుకున్నాక టూత్ బ్రష్ మార్చడం మరచిపోతే మాత్రం మీరు మళ్లీ ఆ వ్యాధిన బారిన పడే ప్రమాదముందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనాలలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో మన లైఫ్ స్టైల్ లో తెలుసుకుందాం.

కరోనా మహమ్మారి నుండి విజయవంతంగా కోలుకున్న వారు వెంటనే టూత్ బ్రష్ మార్చుకోవాలని దంతవైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు అలా చేయకపోతే.. కరోనా మళ్లీ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ బ్రెష్ లపై 72 గంటల పాటు వైరస్ వుంటుందని తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా మీ టూత్ బ్రష్ మరియు టంగ్ క్లీనర్ ను 20 రోజుల తర్వాత ఒకసారి మార్చాలి. అప్పుడే మీ నోట్లో దాగి ఉన్న వైరస్లు లేదా బ్యాక్టిరీయాను తొలగించేందుకు దోహదపడుతుంది.

ఒకవేళ మీకు ఇలా మార్చడం కుదరడానికి కష్టంగా అనిపిస్తే మీరు మీ నోట్లో ఉప్పు నీటితో పుకిలించడం ఉత్తమ మార్గం. దీని కోసం మీరు అనేక రకాల మౌత్ వాష్ ఉత్పత్తులు మార్కెట్లో సులభంగా లభిస్తాయి.ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లో ప్రచురించబడింది. ఇందులో టూత్ బ్రష్ లు 'సూక్ష్మజీవుల జలాశయాలుగా పని చేస్తాయి'. ఇది వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీరు కోవిడ్-19 రోగులు కరోనా నుండి భద్రత కోసం టూత్ బ్రష్ మరియు టంగ్ క్లీనర్ ను ఆరబెట్టడం మరియు శానిటైజ్ చేయడం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News