Mint Benefits: ఎండాకాలం పుదీన ఆకులతో ఈ సమస్యలు దూరం..!
Mint Benefits: ప్రస్తుతం వేసవి కాలంలో పెరిగిన వేడివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Mint Benefits: ప్రస్తుతం వేసవి కాలంలో పెరిగిన వేడివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు మించి చేరుకోవడం ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఈ సీజన్ నుంచి ఉపశమనం పొందాలంటే కచ్చితంగా కొన్ని ఔషధ గుణాలు ఉన్న ఆహారాలని తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో పుదీనా ఔషధం కంటే తక్కుమేమి కాదు. పుదీనాలో విటమిన్-సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
పుదీనా వల్ల చర్మం శక్తిని పొందుతుంది. అందుకే దాని ఆకులను అనేక సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. పుదీనా చర్మంలో తేమను నిలుపుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం నుంచి మురికిని తొలగిస్తుంది. మీకు జీర్ణక్రియలో సమస్యలు ఉంటే పుదీనా మీకు గొప్ప సహాయం చేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కడుపు సమస్యలను తొలగిస్తుంది. ఇందుకోసం ఒక కప్పు నీటిని కొద్దిగా వేడి చేసి అందులో అర టీస్పూన్ పుదీనా రసాన్ని కలిపి తీసుకోవాలి.
మారుతున్న ఉష్ణోగ్రతలో జలుబు సమస్యను ఎదుర్కొంటే ఖచ్చితంగా పుదీనా ఆకులను వాడాలి. మీకు గొంతు నొప్పిగా ఉంటే పుదీనా డికాక్షన్ తాగాలి. ఇది కాకుండా ముక్కు మూసుకుపోయినట్లయితే పుదీనా ఆకులను వాసన చూస్తే మంచి ఉపశమనం ఉంటుంది.
పుదీనాలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా అదనపు కేలరీలు శరీరానికి చేరవు. పొట్ట కొవ్వు పెరిగినప్పుడు పుదీనాను తినమని డాక్టర్లు సలహా ఇవ్వడానికి ఇదే కారణం. పుదీనా మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కొద్ది మందికి మాత్రమే తెలుసు. పుదీనా ఆకులలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉంటాయి. కాబట్టి వాటిని తప్పనిసరిగా తీసుకోవాలి.