Women Health: అమ్మాయిలూ..ప్యాడ్స్ వాడే విషయంలో నిర్లక్ష్యం వద్దు..ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Women Health: పీరియడ్స్ ..మహిళలకు ఒక సవాలు వంటింది. ఈ వారం రోజులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా శానిటరీ ప్యాడ్స్ ఉపయోగించే క్రమంలో వెజైనా దగ్గర దురద, మంట వంటి సమస్యలు వేధిస్తుంటాయి. చాలా మంది శానిటరీ ప్యాడ్స్ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. దీని వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Update: 2024-07-08 02:25 GMT

Women Health: అమ్మాయిలూ..ప్యాడ్స్ వాడే విషయంలో నిర్లక్ష్యం వద్దు..ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Women Health: నెలసరి సమయంలో తలెత్తే సమస్యలు మహిళలను కొన్ని సందర్బాల్లో అసహనానికి గురిచేస్తుంటాయి. అయితే ఈ సమస్యలు వర్షాకాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జననేంద్రియాల వద్ద ఇన్ఫెక్షన్ ఈ కాలంలో ఎక్కువగా వేధిస్తుంది. ఇందుకు చల్లని వాతావరణం, చెమట ఇవే కాదు..మనం వాడే శానిటరీ ప్యాడ్స్ కూడా ఓ కారణం అంటున్నారు వైద్యులు. ఇది క్రమంగా తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తుంది. అందుకే శానిటరీ ప్యాడ్స్ వాడే క్రమంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. నెలసరి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా మరి?

నేటికాలంలో ఎలాంటి వస్తువును తయారు చేసిన అవి పరిమాళాలు వెదజల్లుతున్నాయి. శానిటరీ ప్యాడ్స్, ట్యాంపన్స్ కూడా పరిమాళాలు వెదజల్లుతున్నాయి. సువాసన గా ఉంటాయని..నెలసరి సమయంలో రక్తస్రావం వల్ల వెలువడే దుర్వాసన బయటకు రాకుండా సౌకర్యవంతంగా ఉంటాయని చాలా మంది వీటిని వాడుతుంటారు. ఈ పొరపాటు వెజైనల్ ఇన్ఫెక్షన్లు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్యాడ్స్ తయారీలో రసాయనాల వాడకం ఎక్కువగానే ఉంటుంది. పైగా వాటి క్వాలిటీ కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని పక్కనపెట్టి మంచి క్వాలిటీలో ఉన్న పర్యావరణ రహిత ప్యాడ్స్ ను కొనుగోలు చేయండి.

చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు గంటల తరబడి ఒకే ప్యాడ్ ను వాడుతుంటారు. ఇది ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఒకే ప్యాడ్ ను ఎక్కువ సమయం ఉపయోగించకూడదు. రక్తస్రావంతో పనిలేకుండా నాలుగు లేదా ఐదు గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చడం మంచిది. ఒకేవేళ మరీ తక్కువ బ్లీడింగ్ అయినట్లయితే రోజుకు రెండు ప్యాడ్ల చొప్పున మార్చుకోవడం మర్చిపోవద్దు. రోజంతా ఒకే ప్యాడ్ వినియోగిస్తుంటే ఇన్ఫెక్షనతోపాటు ఇతర సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.

ఇక పీరియడ్స్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడి బ్యాక్టీరియాను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మామూలు సమాయాల్లోనూ శుభ్రతను పాటించాలంటున్నారు నిపుణులు. తర్వాత చేతులను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం.

Tags:    

Similar News