Bacteria Infections: వర్షాకాలం బాక్టీరియాతో పొంచి ఉన్న ప్రమాదం.. ఈ వ్యాధుల నివారణకి ఈ జాగ్రత్తలు..!
Bacteria Infections: వర్షాకాలం వరదల వల్ల చాలా ప్రదేశాల్లో నీరు నిలిచిపోతుంది. దీంతో ఆ నీటిలో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల చాలా వ్యాధులు సంభవిస్తాయి.
Bacteria Infections: వర్షాకాలం వరదల వల్ల చాలా ప్రదేశాల్లో నీరు నిలిచిపోతుంది. దీంతో ఆ నీటిలో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల చాలా వ్యాధులు సంభవిస్తాయి. నిల్వ ఉన్న నీటివల్ల టైఫాయిడ్, కలరా, హెపటైటిస్, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి. సరైన చికిత్స తీసుకోపోతే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వర్షాకాలంలో సురక్షితంగా ఎలా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం.
వర్షంలో తడిస్తే ఇంటికి చేరుకున్న తర్వాత వేడి నీటితో స్నానం చేయండి. దీనివల్ల శరీరంలోకి బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉండదు. శరీరంపై ఏదైనా గాయం ఉంటే బయటకు వెళ్లే ముందు దానిని బ్యాండేజ్‌తో కప్పి ఉంచండి. ఎందుకంటే వరద నీటిలో క్రిములు ఉంటాయి. వీటివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో డెంగ్యూ, మలేరియా కేసులు కూడా పెరుగుతాయి. వీటిని నివారించడానికి ఫుల్ స్లీవ్ దుస్తులను ధరించండి. జ్వరం, తీవ్రమైన తలనొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
తాగడానికి శుభ్రమైన లేదా వేడి చేసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిలిచినప్పుడు ఇంటి గోడలు, ఫర్నిచర్‌ను శుభ్రం చేయాలి. బయటి ఆహారం, నీరు అస్సలు తాగకూడదు. ఇంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. వర్షాకాలంలో నాన్-వెజ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది. వృద్ధులు, నవజాత శిశువులు, వ్యాధిగ్రస్తులు మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. చర్మంపై దురద లేదా ఎర్రటి దద్దుర్లు సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.