Basil Tea: తులసి టీతో ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!
Basil Tea: తులసి చెట్టుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తులసి టీ తాగడం వల్ల కూడా అన్నే ప్రయోజనాలు ఉన్నాయి.
Basil Tea: తులసి చెట్టుని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తులసి టీ తాగడం వల్ల కూడా అన్నే ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి యాంటీవైరస్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫాస్పరస్, కాల్షియం మొదలైన ముఖ్య అంశాలు తులసిలో ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అనేక సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. అందువల్ల తులసి టీ తాగడం చాలా మంచిది.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా మార్చడంలో తులసి టీ చాలా మేలు చేస్తుంది. నేటి కాలంలో, ప్రజలు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తులసి టీ తీసుకోవడం వల్ల మల విసర్జన ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా గ్యాస్ సమస్య, విరేచనాలు, పొట్టలో తిమ్మిర్లు, మలబద్ధకం నుంచి బయటపడవచ్చు.
మంచి నిద్ర కోసం తులసి బాగా ఉపయోగపడుతుంది. నేటి కాలంలో ఒత్తిడి వల్ల ప్రజలు నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో మీరు మంచి నిద్ర కోసం తులసి టీ తాగవచ్చు. అంటే ఓవరాల్‌గా మిగతా టీల కంటే తులసి టీ తాగితే కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.
అలాగే బరువు తగ్గాలని నిర్ణయించుకుంటే.. కచ్చితంగా తులసి టీ తాగాల్సిందే. మనం తిన్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణ చేయడంతోపాటు, కేలరీలను వేగంగా కరిగించేందుకు సహాయపడుతోంది. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించి మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతోంది.