Depression: మానసిక ఒత్తిడిలో వీటికి దూరంగా ఉండటమే బెస్ట్..!
Depression: ఈ రోజుల్లో చాలామంది రకరకాల సమస్యల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
Depression: ఈ రోజుల్లో చాలామంది రకరకాల సమస్యల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీని కారణంగా డిప్రెషన్, టెన్షన్, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా కుటుంబ కలహాలు, ఆఫీసు సమస్యలు, డబ్బు సమస్యలు, స్నేహం-ప్రేమలో మోసం వంటి కారణాల వల్ల ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సమయంలో కొన్ని చెడు అలవాట్లని వదిలేయాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
1. ఆల్కహాల్‌కి నో చెప్పండి
యూత్‌తో పాటు అన్ని వయసుల వారిలో ఆల్కహాల్ తాగే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొంతమంది తమను తాము ట్రెండీగా చూపించుకోవడానికి ఇలా చేస్తుంటారు. చాలా మంది ఇది టెన్షన్‌ను దూరం చేస్తుందని నమ్ముతారు. కానీ ఎక్కువ కాలం వినియోగిస్తే అది చెడు వ్యసనంగా మారుతుంది. ఇందులో ఉండే రసాయనాలు దీర్ఘకాలంలో మీ ఆందోళనను పెంచేలా పనిచేస్తాయి. ఆల్కహాల్ చాలా సందర్భాలలో తక్షణ విశ్రాంతిని ఇస్తుంది. కానీ అది మన నరాలను బలహీనపరుస్తుంది. వీలైనంత త్వరగా దాని నుంచి బయటపడటం ఉత్తమం.
2. కూల్‌డ్రింక్స్
కూల్‌డ్రింక్స్ మనల్ని బాగా ఆకర్షిస్తాయి. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దీని రెగ్యులర్ వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా టెన్షన్ పెరుగుతుంది. మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం తీపి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది.
3. సిగరెట్ మానేయండి
చాలా మంది యువత స్మోక్ చేయడానికి ఇష్టపడతారు. కానీ అది నెమ్మదిగా వారికి హాని చేస్తుంది. సిగరెట్ తాగడం వల్ల కలిగే ప్రభావం నేరుగా మెదడుపై ఉంటుంది. కోరిక పెరిగినప్పుడు ఇది చంచలతను పెంచుతుంది.
4. ప్రాసెస్ చేసిన ఫుడ్
టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఆహారాన్ని నిల్వ ఉంచే ట్రెండ్ బాగా పెరిగింది. అందుకే ఈ రోజుల్లో అనేక రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ మార్కెట్లోకి వచ్చాయి. కానీ అవి అజీర్ణం లేదా కడుపులో ఉబ్బరం కలిగిస్తాయి. అందుకే తాజా పదార్థాలను మాత్రమే తినడం మంచిది.