Cardiac Arrest Symptoms: పురుషులు, స్త్రీలలో కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు వేర్వేరుగా ఉంటాయా..!
Cardiac Arrest Symptoms: ఈ రోజుల్లో కార్డియాక్ అరెస్ట్ కేసులు చాలా పెరుగుతున్నాయి. జీవనశైలి దెబ్బతినడం వల్ల చాలామంది గుండె జబ్బులకు గురవుతున్నారు.
Cardiac Arrest Symptoms: ఈ రోజుల్లో కార్డియాక్ అరెస్ట్ కేసులు చాలా పెరుగుతున్నాయి. జీవనశైలి దెబ్బతినడం వల్ల చాలామంది గుండె జబ్బులకు గురవుతున్నారు. కొన్నిసార్లు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ రోజుల్లో యువతలో కార్డియాక్ అరెస్ట్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు పురుషులు, స్త్రీలలో వేర్వేరుగా ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి?
కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్య. ఈ సమయంలో గుండె అకస్మాత్తుగా రక్తాన్ని పంప్ చేయడం ఆగిపోతుంది. దీని వల్ల శరీర భాగాలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ అయిన కొన్ని నిమిషాల్లో రోగి చనిపోతాడు. చాలా మంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ ఒకటే అనుకుంటారు. కానీ ఇవి రెండు వేర్వేరు. గుండెపోటు కంటే కార్డియాక్ అరెస్ట్ చాలా ప్రమాదకరం.
మహిళల్లో కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
కడుపులో తీవ్రమైన నొప్పి
వాంతులు, వికారం
విశ్రాంతి లేకపోవడం, మూర్ఛ
ఛాతీలో మండుతున్న అనుభూతి
పురుషుల్లో కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు
ఛాతీలో నొప్పి, శరీరం అలసిపోవడం
ఆకస్మిక చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం
కార్డియాక్ అరెస్ట్ సమయంలో హృదయ స్పందన 300 నుంచి 400 వరకు పెరుగుతుంది. దీని వల్ల గుండె పనిచేయడం ఆగిపోయి శరీరానికి రక్త సరఫరా నిలిచిపోతుంది. ఈ పరిస్థితిలో వెంటనే చికిత్స పొందకపోతే వ్యక్తి చనిపోవచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.