Fasting Effect: ఉపవాసం రోజు శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
Fasting Effect: మీరు ఒక రోజు ఉపవాసం ఉంటే శరీరంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.. ఉపవాసం వెనుక సైన్స్‌కి సంబంధించిన వాస్తవాలు ఉంటాయి.
Fasting Effect: మీరు ఒక రోజు ఉపవాసం ఉంటే శరీరంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.. ఉపవాసం వెనుక సైన్స్‌కి సంబంధించిన వాస్తవాలు ఉంటాయి. మీరు ఏ ఆహారం తీసుకున్నా అది మీ శరీరంలో ఇంధనంగా (శక్తి) పనిచేస్తుంది. శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. ఆ తర్వాత శక్తిని శరీరం ఉపయోగించుకుంటుంది. వ్యర్థాలు మలం రూపంలో బయటకు వస్తాయి. శక్తికి ఉపయోగపడని అదనపు ఆహారమేదైనా ఉంటే అది కొవ్వుగా మారుతుంది.
అధిక నూనె, మసాలాలు, అనవసరమైన ఆహారం వల్ల కొవ్వు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే శరీరానికి తక్కువ మొత్తంలో కొవ్వు కూడా అవసరమే. అయితే అధిక కొవ్వు భవిష్యత్తు అవసరాలకి స్టోర్ అవుతుంది. ఉదాహరణకు చాలా రోజులు ఆహారం లభించకపోతే ఈ కొవ్వు మిమ్మల్ని సజీవంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు ఆరు గంటల ఉపవాసం పూర్తి చేసినప్పుడు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితిలో కాలేయం శరీరంలో స్టోర్ చేసిన కొవ్వుని (గ్లైకోజెన్) గ్లూకోజ్‌గా మార్చే ప్రక్రియను ప్రారంభిస్తుంది. తద్వారా శరీరం శక్తిని పొందుతుంది.
మీరు 24 గంటల ఉపవాసాన్ని పూర్తి చేస్తే శరీరంలో స్టోర్ చేసిన కొవ్వుని (గ్లైకోజెన్) ఎక్కువగా ఉపయోగిస్తారు. మొత్తం మీద ఉపవాసం చేసినప్పుడు శరీరంలో చక్కెరకు బదులుగా శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. కొంతమంది రోజుకు 16 గంటలు ఉపవాసం ఉంటారు. దీనివల్ల వేగంగా బరువు తగ్గుతారు. కానీ ఆహారం తినకుండా ఇతర ఆహారాల నుంచి కేలరీలు తీసుకుంటే ఎటువంటి ఫలితం ఉండదు.
ఉపవాసం వల్ల మెదడు మెరుగ్గా పనిచేస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ముఖం, శరీరంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. క్యాన్సర్ కణాల నిర్మాణం తగ్గుతుంది. అంటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. కానీ జీవ క్రియలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఉపవాసం స్త్రీలలో తక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. కానీ పురుషులలో ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.