Health Tips: ఈ దుంప తింటే ఎర్రరక్తకణాలు పెరుగుతాయి.. కానీ కొంతమందికి ఇష్టముండదు..!

Health Tips: అయితే వేసవిలో ముల్లంగి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది

Update: 2023-06-15 15:00 GMT

Health Tips: ఈ దుంప తింటే ఎర్రరక్తకణాలు పెరుగుతాయి.. కానీ కొంతమందికి ఇష్టముండదు..!

Health Tips: కొంతమందికి శరీరంలో ఎర్రరక్తకణాల కొరత ఉంటుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో డైట్‌లో ఒక దుంపని చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దానిపేరు ముల్లంగి ఇదంటే కొంతమందికి ఇష్టముండదు. కానీ దీనిలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. వాస్తవానికి దీనిని శీతాకాలంలో ఎక్కువగా తింటారు. అయితే కొంతమంది వేసవిలో కూడా తీసుకుంటారు. చలికాలంలో ముల్లంగి తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వేసవిలో ముల్లంగి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. ముల్లంగి ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. రక్తాన్ని పెంచుతుంది

ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో RBC అంటే ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. ముల్లంగి తినడం వల్ల దెబ్బతిన్న కణాలు కూడా బాగుపడతాయి. ఈ ప్రక్రియలో భాగంగా రక్తంలో ఆక్సిజన్ సరఫరా కూడా పెరుగుతుంది.

2. అధిక ఫైబర్

మీరు ప్రతిరోజూ ముల్లంగిని సలాడ్‌గా తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఫైబర్ లోపాన్ని భర్తీ చేస్తుంది. దీంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

3. గుండెకు మేలు

ముల్లంగి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గుండె సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వీటితో పాటు విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.

4. రక్తపోటు అదుపులో

ముల్లంగిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. హై బీపీతో బాధపడుతున్నట్లయితే వేసవిలో ముల్లంగిని తినవచ్చు.

5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ముల్లంగిలో అధిక విటమిన్ సి ఉంటుంది. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు ముల్లంగి తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఇది కాకుండా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.

Tags:    

Similar News