Uric Acid Problem: శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ లక్షణాలు.. రావడానికి గల కారణాలు తెలుసుకోండి..!

Uric Acid Problem: నేటి రోజుల్లో కొన్ని రకాల వ్యాధులు సాధారణంగా మారిపోయాయి. అందు లో కిడ్నీలో రాళ్లు రావడం, మధుమేహం, యూరిక్‌ యాసిడ్‌ వంటి రోగాలు ఉన్నాయి.

Update: 2024-04-17 14:30 GMT

Uric Acid Problem: శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ లక్షణాలు.. రావడానికి గల కారణాలు తెలుసుకోండి..!

Uric Acid Problem: నేటి రోజుల్లో కొన్ని రకాల వ్యాధులు సాధారణంగా మారిపోయాయి. అందు లో కిడ్నీలో రాళ్లు రావడం, మధుమేహం, యూరిక్‌ యాసిడ్‌ వంటి రోగాలు ఉన్నాయి. ఇందులో యూరిక్‌ యాసిడ్‌ చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల అనేక ఇతర రోగాలు సంభవిస్తాయి. శరీరం లో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ అనే పదార్ధం విచ్ఛిన్నం ద్వారా ఏర్పడిన రసాయనం. ఇది ఆరోగ్యానికి అవసరమే మోతాదు మించిదే హానికరం కూడా. ఇది మీ శరీరంలో ఎంత ఉందనే దానిపై ఈ వ్యాధి ఆధారపడి ఉంటుంది.

బాడీలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కొన్ని అధ్యయనాలలో ఇది అధిక రక్తపోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌, మెటబాలిక్ సిండ్రోమ్‌తో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తికి మధుమే హం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది ప్రాణాంతక వైద్య పరిస్థితి. ఈ ప్రమాదాలను నివారించడానికి అధిక యూరిక్ యాసిడ్ ప్రారంభ లక్షణాలను గమనించి చికిత్స తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ సాధారణంగా పురుషులలో 7 మిల్లీగ్రాముల డెసిలీటర్‌కు (mg/dL), మహిళల్లో 6 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా పరిగణిస్తారు.

యూరిక్‌ యాసిడ్‌ లక్షణాలు

1. కాలి బొటనవేలు నొప్పి

2. బొటనవేలు వాపు

3. చీలమండ నుంచి మడమ వరకు నొప్పి

4. పాదం అడుగు భాగంలో తీవ్రమైన నొప్పి

5. మోకాలి నొప్పి

6. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు నొప్పి, కీళ్లలో దృఢత్వం, చర్మం ఎర్రబడడం, మూత్రంలో రక్తం, తరచుగా మూత్రవిసర్జన, జననేంద్రియ ప్రాంతానికి చేరే నడుము నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు

శరీరంలో యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లలేని పరిస్థితిలో అధికమవుతుంది. ఒక వ్యక్తి అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, డైయూరిటిక్స్ తీసుకున్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. ఇది కాకుండా సోడా, ఫ్రక్టోజ్ ఉన్న ఆహారాల వినియోగం, అధిక రక్తపోటు, రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు, మూత్రపిండాల సమస్యలు, లుకేమియా, మెటబాలిక్ సిండ్రోమ్, ఊబకాయం, ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది.

Tags:    

Similar News