Eat Fruits: పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎప్పుడు తినాలంటే..?
Eat Fruits:పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ఏ సీజన్లో లభించే పండ్లు ఆ సీజన్లో తినాలి.
Eat Fruits: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే ఏ సీజన్లో లభించే పండ్లు ఆ సీజన్లో తినాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. పండ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను నివారించవచ్చు. అయితే సరైన సమయంలో తినకుంటే లాభానికి బదులు నష్టం జరుగుతుంది. అయితే పండ్లు తినడానికి సరైన సమయం గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పండ్లు ఎప్పుడు తినాలి?
ఆపిల్, అరటి, పుచ్చకాయ, అవకాడో, మామిడి, పైనాపిల్, సపోటా వంటి పండ్లను ఉదయాన్నే తినాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి.
విటమిన్లు, మినరల్స్
ఉదయం పూట పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ త్వరగా అందుతాయి. ఇది రోజు మొత్తం చురుకుగా ఉండేందుకు దోహదం చేస్తాయి.
శరీరం హైడ్రేటెడ్‌గా
పుచ్చకాయ, నారింజ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో రోజు మొత్తంలో డీ హైడ్రేషన్కు గురికాకుండా ఉంటారు.
సహజ చక్కెర
పండ్లలో సహజ చక్కెర లభిస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
బరువు తగ్గడం
పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బరువు తగ్గాలని కోరుకుంటే ఉదయం ఖచ్చితంగా పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి.