Health Tips: ఖర్జూర పోషకాల భాండాగారం.. ఈ వ్యాధుల వారికి దివ్యౌషధం..!
Health Tips: ఖర్జూర పోషకాల భాండాగారం.. ఈ వ్యాధుల వారికి దివ్యౌషధం..!
Health Tips: డ్రై ఫ్రూట్స్‌లో కర్జూరకి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని పూజలలో కూడా ఉపయోగిస్తారు. ఖర్జూరం పోషకాల భాండాగారం. ఇందులో అనేక రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్, బరువు తగ్గడం వంటి సమస్యలతో పోరాడడంలో సహాయపడతాయి. ఖర్జూరలో ఎండు ఖర్జూర, పండు ఖర్జూర రెండు రకాలు ఉంటాయి. ఖర్జూర ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1. బరువు తగ్గుతారు
స్థూలకాయంతో బాధపడేవారికి ఖర్జూరం మంచి ఎంపిక. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఖర్జూరాన్ని ఉపయోగిస్తారు. ఇందుకోసం ఎండు ఖర్జూర తీసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. దీనిని ఉపయోగించడం వల్ల మధుమేహం సమస్య నుంచి బయటపడుతారు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
2. బీపీని నియంత్రించండి
మీరు అధిక రక్తపోటు ఉన్న రోగి అయితే ఖర్జూర తినడం చాలా మంచిది. ఇది మీ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పురుషులకి తగినంత శక్తిని అందిస్తుంది. రక్తహీనత నుంచి కాపాడుతుంది.
3. రోగనిరోధక వ్యవస్థ పటిష్టం
మీరు కడుపు సమస్యలతో బాధపడుతుంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. వీటిలో యాంటీడైరియాల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి కడుపు సమస్యలను దూరం చేస్తాయి. ఖర్జూరం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చలికాలంలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత అనేది ఉండదు.