శరీరంలోని ఈ 3 భాగాలలో నొప్పి ఉందా.. అయితే మీ బాడీలో ఇది పెరిగింది..!
Body Pain: నేటి కాలంలో చాలామంది అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్నారు.
Body Pain: నేటి కాలంలో చాలామంది అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఎందుకంటే వారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగింది. ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరగడం వల్ల మనుషులు మునుపటి కంటే సోమరిగా మారుతున్నారు. శారీరక శ్రమ చేయడంలేదు. ఆయిల్ ఫుడ్ వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఒత్తిడి, మధుమేహం, హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి వ్యాధులకు కారణమవుతుంది.
కొలెస్ట్రాల్ ఒక అంటుకునే జిగట పదార్థం. ఇది మంచి, చెడు రెండు రకాలుగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ ద్వారా శరీరంలో ఆరోగ్యకరమైన కణాలు తయారవుతాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. వైద్యుల ప్రకారం ఆరోగ్యకరమైన పెద్దలు 200 mg / dl వరకు కొలెస్ట్రాల్ కలిగి ఉండాలి. ఈ స్థాయి 240 mg / dl కంటే ఎక్కువగా ఉంటే ప్రమాదం పెరిగిందని అర్థం చేసుకోవాలి. మీరు మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.
రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే మీకు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ధమనులను దెబ్బతీస్తుంది. రక్త ప్రసరణపై చెడు ప్రభావం చూపుతుంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) కారణంగా శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి శరీరంలో మార్పులు రావడం ఖాయం. మీరు వ్యాయామం లేదా భారీ వ్యాయామం చేసినప్పుడు తొడలు, తుంటి, కాళ్ళలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అందువల్ల ఈ రకమైన నొప్పిని విస్మరించవద్దు. వెంటనే కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి.