మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉంటుందా..! వెంటనే జాగ్రత్త పడండి..

Dysuria Symptoms: మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించినా లేదా మూత్రం రంగులో మార్పు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు

Update: 2021-11-17 08:00 GMT

మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉంటుందా..! వెంటనే జాగ్రత్త పడండి.. (ఫైల్ ఇమేజ్)

Dysuria Symptoms: మీరు మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించినా లేదా మూత్రం రంగులో మార్పు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇది డైసూరియా వ్యాధి లక్షణం కావచ్చు. మూత్రంలో ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వల్ల ఈ రకమైన సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. ఇది చెడ్డ ఆహారపు అలవాట్లు లేదా మూత్రనాళంలో ఏదైనా బ్యాక్టీరియా ఉండటం వల్ల జరుగుతుందని చెప్పారు.

ఇవి కాకుండా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఏదైనా ఔషధాల వల్ల (కీమోథెరపీ ఔషధం వంటివి), మూత్రపిండాల్లో రాళ్లు, రేడియేషన్ థెరపీ కూడా సమస్యను కలిగిస్తాయి. అటువంటి సందర్భాలలో చెడు బ్యాక్టీరియా మూత్రాశయం లేదా మూత్రనాళంలో పెరుగుతూ కిడ్నీకి చేరుకుంటుంది. ఈ స్థితిలో మూత్రంలో వాసన, రంగు కూడా మారుతుంది. మూత్రం పింక్ లేదా ఎరుపు రంగులో ఉంటే మూత్ర నాళంలో రక్తస్రావం ఉందని అర్థం. ఇది చాలా ప్రాణాంతకం.

మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణమని వైద్యులు సూచిస్తు్న్నారు. అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కేవలం మూత్రం ద్వారా మాత్రమే తెలియవు. చాలా సార్లు, నడుము దిగువ భాగంలో స్థిరమైన, పదునైన నొప్పి ఉంటుంది. ఇవన్నీ కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఇలాంటివి లక్షణాలుంటే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. ఈ సమస్యకి ఎక్కువ కాలం చికిత్స చేయకపోతే అది మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది. అటువంటి సందర్భాలలో రోగి జీవితాన్ని కాపాడటానికి అతని కిడ్నీ మార్పిడి చేయవలసి ఉంటుంది.

పుష్కలంగా నీరు తాగాలి..

నీటి కొరత వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి రోజంతా నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇది మీ శరీరం నుంచి మురికి, చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అప్పుడే మూత్రనాళం పూర్తిగా శుభ్రంగా ఉంటుంది. ఇది కాకుండా మీ ఆహారం, జీవనశైలిని సరిగ్గా ఉంచడానికి ప్రయత్నించండి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవద్దు. అలాగే మద్యం సేవించకూడదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News