Health Tips: అర్ధరాత్రి అధిక దాహం వేస్తుందా.. ఈ వ్యాధుల లక్షణాలని గమనించండి..!

Health Tips: అర్ధరాత్రి అధిక దాహం వేస్తుందా.. ఈ వ్యాధుల లక్షణాలని గమనించండి..!

Update: 2023-05-28 16:00 GMT

Health Tips: అర్ధరాత్రి అధిక దాహం వేస్తుందా.. ఈ వ్యాధుల లక్షణాలని గమనించండి..!

Health Tips: అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్నప్పుడు కొంతమందికి ఒక్కసారిగా దాహం వేస్తుంది. నీళ్లు తాగాక కొద్దిసేపటికి మళ్లీ దాహం వేస్తుంది. ఇలా తరచుగా జరుగుతూనే ఉంటుంది. దీంతో నిద్రభంగం జరుగుతుంది. ఇలా జరిగితే అస్సలు తేలికగా తీసుకోవద్దు. ఎందుకుంటే ఇది కొన్నిరకాల వ్యాధుల లక్షణంగా చెప్పవచ్చు. చాలామంది ఎండాకాలం వేడివల్ల ఇలా జరుగుతుందనిఅనుకుంటారు. కానీ ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారో ఈరోజు తెలుసుకుందాం.

శరీరంలో బ్లడ్ షుగర్ ఎక్కువైతే శరీర వ్యవస్థ దానిని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. దీని వల్ల మూత్రం ఎక్కువగా వచ్చి శరీరంలో నీటి కొరత ఏర్పడి తరచుగా దాహం వేస్తుంది. బీపీ పెరిగినప్పుడు ఎక్కువగా చెమట పడుతుంది. దీంతో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా అధికంగా దాహం వేస్తుంది. దీంతె రాత్రిపూట నిద్రభంగం జరుగుతుంది. మీరు ఈ సమస్యని ఎదుర్కొన్నట్లయితే ఒక్కసారి బీపీ చెక్‌ చేసుకోవడం మంచిది.

డీ హైడ్రేషన్‌

రాత్రిపూట దాహంగా అనిపించడం డీహైడ్రేషన్ సమస్యకి కారణం అవుతుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు లేకపోవడం. దీని కోసం క్రమం తప్పకుండా నీరు తాగడం అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని గుర్తుంచుకోండి.

డైట్‌లో మార్పులు

మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే వ్యాయామ దినచర్యను పాటించాలి. అలాగే రోజువారీన డైట్‌లో మార్పులు చేయాలి. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్, సంతృప్త కొవ్వును మితంగా తీసుకోవాలి.

సరైన జీవనశైలి

బిపిని నియంత్రించడానికి సరైన జీవనశైలిని మెయింటెన్‌ చేయాలి. ఇందుకోసం ఆహారంలో సోడియం తక్కువగా తీసుకుని, ఊబకాయం రాకుండా చూసుకోవాలి. ఆల్కహాల్ తీసుకుంటే వెంటనే దానిని తగ్గించండి. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు బీపీ చెక్‌ చేసుకోండి.

Tags:    

Similar News