Iron Deficiency: ఐరన్‌ లోపం చాలా డేంజర్‌.. ఈ లక్షణాలని విస్మరించవద్దు..!

Iron Deficiency: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎర్ర రక్త కణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

Update: 2023-03-02 02:30 GMT

Iron Deficiency: ఐరన్‌ లోపం చాలా డేంజర్‌.. ఈ లక్షణాలని విస్మరించవద్దు..!

Iron Deficiency: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎర్ర రక్త కణాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని ఇతర భాగాలకు తీసుకువెళ్లడంలో సహాయపడుతాయి. అలాగే ఊపిరితిత్తుల నుంచి కార్బన్ డయాక్సైడ్‌ని బయటికి పంపించడంలో తోడ్పడుతాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల లోపం ఉన్నప్పుడు ఐరన్ లోపం అనీమియా ఏర్పడుతుంది. ఇది ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడే ముఖ్యమైన ఖనిజం.

అలసట

రక్తహీనత అనేది శరీరంలో ఎర్ర రక్త కణాల స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది. ఆక్సిజన్ శరీర కణజాలాలకు చేరుకోలేనప్పుడు ఇది జరుగుతుంది. అలసట అనేది అనీమియ లక్షణం. ఒకరికి పనులు చేయడం కష్టంగా అనిపించవచ్చు నిద్ర లేదా తేలికపాటి వ్యాయామం చేయడంలో ఇబ్బంది ఉండవచ్చు.

వేగవంతమైన హృదయ స్పందన

ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా చేయడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ కోసం గుండె కష్టపడి పని చేస్తుంది. ఇది హృదయ స్పందనలో సమస్యలను కలిగిస్తుంది. ఇది వేగవంతమైన హృదయ స్పందనకు కారణమవుతుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

శరీరంలోని ఐరన్ లోపం వల్ల శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. ఐరన్‌ లోపం వల్ల చర్మం పాలిపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పి, కళ్లు తిరగడం, చేతులు, కాళ్లు చల్లబడడం, పెళుసుగా ఉండే గోర్లు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి.

మినరల్ లోపం అనేది ఋతుక్రమం ఉన్న స్త్రీలలో సర్వసాధారణం. వారు పీరియడ్స్ సమయంలో రక్తాన్ని కోల్పోవడం వల్ల వస్తుంది. శాకాహారులకు కూడా ఐరన్‌ లోపం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే మాంసం ఐరన్‌ ఉత్తమ వనరులలో ఒకటి. శిశువులు, ముఖ్యంగా తక్కువ బరువు ఉన్నవారు, నెలలు నిండకుండా జన్మించినవారు, తల్లి పాలు తగినంత తీసుకోని వారు ఐరన్ లోపానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. 

Tags:    

Similar News