Health Tips: యూరిక్ యాసిడ్ తొలగించాలంటే ఇది డైట్‌లో ఉండాల్సిందే..!
Health Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
Health Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాస్తవానికి మూత్రపిండాలు యూరిక్ యాసిడ్‌ను సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు కీళ్లలో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది. ఈ కారణంగా పాదాలలో వాపు, కీళ్ల నొప్పులు ఏర్పడుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నిత్యం మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. వాటి గురించి తెలుసుకుందాం.
వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య తొలగిపోతుంది. ఎందుకంటే వీటిలో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఇందులో రాగి, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి. అదనంగా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. అంతేకాదు ఈ డ్రై ఫ్రూట్‌లో హెల్తీ ప్రొటీన్లు లభిస్తాయి. ఇవన్నీయూరిక్ యాసిడ్ వల్ల వచ్చే సమస్యని తగ్గించడానికి సహాయపడుతాయి.
ప్రతి రోజూ 3నుంచి 4 మీడియం సైజ్ వాల్ నట్స్ తింటే యూరిక్ యాసిడ్ సమస్య సులువుగా తగ్గుతుంది. మీరు ఈ డ్రై ఫ్రూట్‌ని నేరుగా తినవచ్చు లేదా స్మూతీ, షేక్ లేదా సలాడ్‌లలో వేసుకొని తీసుకోవచ్చు. కొంతమంది నీటిలో నానబెట్టిన వాల్‌నట్‌లను తినడానికి ఇష్టపడతారు. ఈ పద్ధతి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.