Immunity Booster Foods: కరోనాకు చెక్ పెట్టే రోగ నిరోధక శక్తి
Immunity Booster Foods: కరోనా లాంటి మహమ్మారులను తరిమి కొట్టాలంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటమే మార్గం.
Immunity Booster Foods: దేశంలో కరోనా మహమ్మారి ముప్పతిప్పలు పెడుతోంది. గత సంవత్సరం వచ్చింది కదా ఈ సంవత్సరం రాదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వైరస్ తన గతిని మార్చుకుంటూ మనుషుల్లో ఇమ్యూనిటీ పవర్ ను తట్టుకునే విధంగా ఇంకో రూపంలో వస్తూ వుంటుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. మరి అస్సలు కరోనాను ఎదుర్కోవాలంటే ఏమి చేయాలి. దాని ఏ మందులు వాడాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలని అందరి మనసులను తొలిచి వేసే ప్రశ్న. ఇలాంటి మహమ్మారుల నుండి రక్షించుకోవాలంటే మన శరీరంలో తిరుగులేని ఆయుధం రోగ నిరోధక శక్తిని ఇనుమడింపజేసుకోవటం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పక వ్యాయామం, కంటి నిండా నిద్ర, ఒత్తడిని తగ్గించుకోవటం వంటివన్నీ రోగనిరోధక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయి. అన్నింటికన్నా సమతాలాహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంపొందటానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.
ప్రతీ రోజు 30 నిమిషాల పాటు యోగాసనాలు, లేదా శారీరక వ్యాయామం చేస్తుండాలి. వీటి ద్వారా మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా రోగాలు దరిచేరవు. మనసు ప్రశాంతంగా ఉండటంతో శరీర అవయవాలపైన ఒత్తిడి పెరగకుండా ఉంటుంది.
క్యారెట్లు, ఆకుకూరల్లో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో ఉండే విష పదార్థాలు, సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. క్యారెట్లతోపాటు ఆకుకూరలు, చిలగడదుంప, కీరాదోస, మామిడి పండ్లు, కర్బూజా పండ్లలో, యాప్రికాట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్-ఎ గా మారి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
సొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, తులసీ, డై గ్రేప్స్‌తో చేసిన టీ లేదా డికాక్షన్ రోజూ కనీసం రెండు సార్లు తాగినట్లతే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసం కలిపి తాగితే ఎంతో మేలు. గొంతునొప్పి ఉన్నవారు, గొంతు పొడిబారినట్లయితే పుదీనా ఆకులు, వామ వాసన చూడాలి. ఇలా చేసినట్లయితే ఎంతో ఫలితం ఉంటుంది. లవంగాలు పొడి చేసుకుని చక్కెర, తేనెలో కలిపి ప్రతీ రోజు రెండు, లేదా మూడు సార్లు తాగాలి.
మన శరీరంలో రోగ నిరోధక కణాలను, తెల్ల రక్త కణాలను వృద్ధి చేసేందుకు విటమిన్-సి ఎంతగానో ఉపయోగపడుతుంది. ద్రాక్ష, నారింజ, బత్తాయి పండ్లు, కివీలు, స్ట్రాబెర్రీలు, బెంగళూరు క్యాబేజీ, క్యాప్సికం, మిరియాలు, ఉడకబెట్టిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లలో మనకు విటమిన్-సి అధికంగా లభిస్తుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బాక్టీరియా, వైరస్‌లు రక్తంలో ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే విటమిన్-డి తగినంతగా ఉంటే ఆ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అందుకు విటమిన్ డి ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. అలాగే చేపలు, గుడ్లు, పాలు, చీజ్, వెన్న, పనీర్, పుట్టగొడుగులలోనూ విటమిన్-డి లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలో ఇన్‌ఫెక్షన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయాబీన్, మాంసం, శనగలు, చిక్కుడు జాతి గింజలు, చిరు ధాన్యాలు, గింజలు, చీజ్, పనీర్, పెరుగులలో జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మనకు జింక్ లభిస్తుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.
మనం తినే ఆహారం మీదనే పేగుల ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. శ్వాసకోశ ఇన్ ఫెక్టన్ల ముప్పు తగ్గటంలోనూ, ఒక వేళ తలెత్తినా త్వరగా తగ్గటంలోనూ ప్రొబయోటిక్స్ ఉపయోగపడతున్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి పేగుల్లో మనకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా వృద్ది కావటానికి తోడ్పడతాయి. ప్రోబయోటెక్స్ కోసం కందులు, పెసర్లు, శనగలు, రాజ్మా వంటి పప్పు దినుసులు, పెరుగు, మజ్జిగ వంటి వాటిని ఎక్కువ గా తీసుకుంటూ వుండాలి. అలా తెల్లగా వుండే బియ్యం కన్నా పాలిష్ తక్కువగా వుండే ముడి బియ్యానికి ప్రాధాన్యత ఇస్తే మంచిది.