Health Tips: ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్‌ని తగ్గిస్తాయి.. వెంటనే డైట్‌లో చేర్చుకోండి..!
Health Tips: ఈరోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది.
Health Tips: ఈరోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. దీనివల్ల అనేక వ్యాధులు చుట్టుముడతాయి. శరీరంలో కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అది శరీరంలోని కీళ్లలో పేరుకుపోతుంది. దీని వల్ల కీళ్లనొప్పులు ఎదురవుతాయి. అయితే ఆహారం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఏయే ఆహార పదార్థాలు యూరిక్ యాసిడ్‌ని తగ్గిస్తాయో ఈరోజు తెలుసుకుందాం.
తక్కువ కొవ్వు పదార్థాలు
మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే ఆహారంలో తక్కువ కొవ్వు పదార్థాలను చేర్చుకోవాలి. దీంతో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు.
తాజా పండ్లు, కూరగాయలు
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నట్లయితే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.
తృణధాన్యాలు తీసుకోండి
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నట్లయితే ఆహారంలో తృణధాన్యాలు, చిక్కుళ్ళు ఉండాలి. ఎందుకంటే వీటి వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు.
గుడ్లు తినండి
నాన్ వెజ్ తినే వారు గుడ్లతో రోజుని ప్రారంభిస్తారు. పరిమిత పరిమాణంలో గుడ్లు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగే సమస్య తొలగిపోతుంది. కాబట్టి గుడ్లు తినవచ్చు.