Sleep Effect: ఈ పరిస్థితులలో 8 గంటల నిద్ర సరిపోదు.. ఎక్కువ నిద్ర అవసరం..!
Sleep Effect: ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రశాంతమైన నిద్ర అవసరం
Sleep Effect: ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రశాంతమైన నిద్ర అవసరం. సాధారణంగా చాలా మంది ఆరోగ్య నిపుణులు 24 గంటల్లో కనీసం 8 గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తారు. అప్పుడు మాత్రమే శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. అలసిపోకుండా రోజులో అవసరమైన పని చేసుకోగలుగుతాము. అయితే ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా స్పందిస్తుంది. అందుకే కొంతమందికి నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం నిద్ర అవసరమవుతుంది. లేకుంటే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది.
కొంతమందికి 8 గంటల నిద్ర సరిపోదు
సాధారణంగా మనం 8 గంటల నిద్రపోతాం. అయితే కొంతమందికి బలహీనత కారణంగా ఎక్కువ నిద్ర అవసరమవుతుంది. ముఖ్యంగా రెండు పరిస్థితులలో ఎక్కువ నిద్రపోవాలి. ఇది 8 గంటల నుంచి 9 లేదా 10 గంటల వరకు ఉంటుంది.
1. ఋతువుల మార్పు
వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు చాలా సార్లు సాధారణం కంటే ఎక్కువ నిద్రపోవాల్సి వస్తుంది. సీజన్ మారినప్పుడు మీరు రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను పోలేకపోవచ్చు. ఈ సందర్భంలో మీరు నిద్రను పూర్తి చేయడానికి ఎక్కువ నిద్రపోవలసి ఉంటుంది.
2. ఋతుచక్రం
రుతుచక్రం సమయంలో స్త్రీల శరీరం అనేక అంతర్గత మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో ఆమె చాలా బలహీనంగా, అలసిపోయినట్లు కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఆమె సుమారు 9 గంటలు నిద్రపోవాలి. అప్పుడే సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.