Health Tips: వర్షాకాలం పిల్లల్లో ఇమ్యూనిటి పవర్‌ తగ్గుతుంది.. ఈ చిట్కాలు పాటించి రోగాలకి చెక్‌ పెట్టండి..!

Health Tips: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా అంటువ్యాధులకి గురవుతారు.

Update: 2023-07-19 16:00 GMT

Health Tips: వర్షాకాలం పిల్లల్లో ఇమ్యూనిటి పవర్‌ తగ్గుతుంది.. ఈ చిట్కాలు పాటించి రోగాలకి చెక్‌ పెట్టండి..!

Health Tips: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా అంటువ్యాధులకి గురవుతారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ఎందుకంటే పెద్దల కంటే వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో త్వరగా జలుబు, ఫ్లూ బారిన పడతారు. ఇవి క్రమంగా వైరల్‌గా మారుతాయి. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా పిల్లల ఇమ్యూనిటి పవర్‌ని పెంచవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

పసుపు వాడకం

పసుపులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఆయుర్వేదంలోనే దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తాయి. 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు అనారోగ్యంతో ఉంటే పసుపుతో కూడిన గోరువెచ్చని నీటిని తాగించవచ్చు. గొంతు నొప్పి లేదా జలుబు సమస్యను దీని ద్వారా అధిగమించవచ్చు.

కొబ్బరి నీళ్లు తాగించాలి

శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు శక్తి కూడా తగ్గుతుంది. ఇలాంటి సమయంలో వారికి కొబ్బరి నీళ్ళు తాగిపించాలి. ఇందులో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంతేకాదు ఈ నీళ్లు రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలు ఇష్టంగా తాగుతారు.

ఆమ్ల ఫలాలు

విటమిన్ సి ఉన్న పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. పిల్లలకు నిమ్మ, కివి, బెర్రీలు సిట్రస్‌ జాతి పండ్లని ఎక్కువగా తినిపించాలి. వీటి ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. రోగాలని తట్టుకునే శక్తి వస్తుంది.

పెరుగు తినిపించాలి

వర్షాకాలంలో పిల్లలకు పెరుగు తినిపించాలా వద్దా అనే అయోమయం తల్లిదండ్రుల్లో ఉంటుంది. కానీ కచ్చితంగా వారికి పెరుగు అందించాలి. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంపొందించే మూలకాలు ఉంటాయి. అందుకే పగటిపూట పెరుగన్నం తినేలా ప్రోత్సహించాలి.

Tags:    

Similar News