నలబై ఏళ్ల వయసులో కూడా అందంగా కనిపించాలంటే ఈ ఫుడ్స్‌ తినాల్సిందే..!

Health Tips: ప్రతి అమ్మాయి చాలా కాలం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటుంది.

Update: 2022-12-16 06:00 GMT

నలబై ఏళ్ల వయసులో కూడా అందంగా కనిపించాలంటే ఈ ఫుడ్స్‌ తినాల్సిందే..!

Health Tips: ప్రతి అమ్మాయి చాలా కాలం యవ్వనంగా కనిపించాలని కోరుకుంటుంది. అయితే 40 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు వారి రూపం గురించి ఆందోళన చెందుతారు. ఎందుకంటే ముఖంపై ముడతలు వస్తాయి. దీంతో అంద విహీనంగా కనిపిస్తారు. పెరుగుతున్న వయస్సును ఆపలేము కానీ దాని ప్రభావాన్ని తగ్గించడం మాత్రం సాధ్యమే. మీరు 40 ఏళ్ల వయస్సులో కూడా బాలీవుడ్ నటిలా కనిపించాలంటే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తినాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. ఆరెంజ్

ఆరెంజ్ చాలా మంది ఆసక్తిగా తినే ఒక సాధారణ పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా మీ ముఖం గ్లో చెక్కుచెదరకుండా ఉంటుంది.

2. క్యారెట్

క్యారెట్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఇది చర్మానికి అంతర్గత పోషణను అందిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీరు ప్రతిరోజూ పచ్చి క్యారెట్‌లను తింటే ముఖంపై వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది.

3. క్యాబేజీ

క్యాబేజీ ఒక కూరగాయ. ఇది బలమైన యాంటీఆక్సిడెంట్లని కలిగి ఉంటుంది. వీటి సహాయంతో సెల్ నష్టాన్ని నివారించవచ్చు. సూర్యుని ప్రమాదకరమైన UV కిరణాల నుంచి రక్షింపబడుతాము. క్యాబేజీని సలాడ్‌గా లేదా తేలికగా ఉడికించి తినవచ్చు.

4. బచ్చలికూర

పచ్చి ఆకు కూరలలో బచ్చలికూర చాలా ముఖ్యమైనది. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కె రక్తనాళాలని బలపరుస్తుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది ముడతలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News