Health Tips: ఉదయం టిఫిన్‌గా ఈ దేశీ ఆహారాలు సూపర్.. అలసట, బలహీనత దూరం..!
Health Tips: మీరు ఉదయం పూట ఏది తిన్నా అది మొత్తం దినచర్యపై ప్రభావం పడుతుంది.
Health Tips: మీరు ఉదయం పూట ఏది తిన్నా అది మొత్తం దినచర్యపై ప్రభావం పడుతుంది. ఉదయాన్నే మసాలాతో కూడిన ఆహారం తింటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా భారీ అల్పాహారం తింటే రోజంతా కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఏమీ తినకపోతే బలహీనత, అసిడిటీ మొదలవుతుంది. అందుకే రోజు అల్పాహారంలో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
పోహా
ఉదయాన్నే అల్పాహారంలో పోహాను తీసుకోవచ్చు. ఇది రుచికరమైనది అంతేకాకుండా తేలికైనది. జీర్ణక్రియకు ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. ఇది రుచిగా ఉండాలంటే అందులో వేరుశెనగలు, కూరగాయలు, కరివేపాకు, నిమ్మరసం కలుపుకోవచ్చు. దీన్ని రోజూ తినడం వల్ల శరీర బలం పెరుగుతుంది. బరువు కూడా సమతుల్యంగా ఉంటుంది.
ఉప్మా
అల్పాహారంలో ఉప్మా తినవచ్చు. దీనిని ఉప్మారవ్వతో తయారుచేయవచ్చు. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. రుచి కోసం ఇందులో పెసరపప్పుని జోడించవచ్చు. ఉప్మాలో కరివేపాకు, కూరగాయలు, ఆవాలు వేస్తే తిన్నాక పొట్ట బరువుగా అనిపించదు.
ఇడ్లీ
ఇడ్లీ తినడానికి రుచిగా ఉండటమే కాకుండా సులువుగా జీర్ణమవుతుంది. సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో ఇడ్లీ తింటే అద్భుత రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్య పరంగా చాలా మంచిది. ఇది తేలికైన బ్రేక్‌ఫాస్ట్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది.
దోశ
మినపపప్పు, బియ్యం గ్రైండ్ చేయడం ద్వారా వచ్చిన పిండితో దోశలు వేయవచ్చు. వీటిని వేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇది పోషక గుణాలతో నిండి ఉంటుంది. దీనిని సాంబార్ లేదా చట్నీతో తినవచ్చు. దోశ తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్-ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.