Snoring Problem: గురకను నిర్లక్ష్యం చేయవద్దు.. దీనివల్ల చాలా ప్రమాదం..!
Snoring Problem: చాలామంది పడుకున్న వెంటనే గురకపెడుతారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్నగా మొదలై పెద్ద శబ్ధంగా మారుతుంది.
Snoring Problem: చాలామంది పడుకున్న వెంటనే గురకపెడుతారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్నగా మొదలై పెద్ద శబ్ధంగా మారుతుంది. వీరి చుట్టు పక్కల పడుకున్నవారికి ఈ శబ్ధం వల్ల అసలు నిద్రే పట్టదు. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే అనేక వ్యాధులు సంభవిస్తాయి. గురక సమస్య కొత్తగా అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది. దీర్ఘకాలంగా గురకతో బాధపడేవారిలో జ్ఞాపకశక్తి దెబ్బతినే ప్రమాదం ఉందని ఓ పరిశోధనలో తేలింది. గురక వల్ల మెదడు పనితీరు ప్రభావితమైతే భవిష్యత్‌లో అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
అల్జీమర్స్ రీసెర్చ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం ఎక్కువ కాలం గురక సమస్య ఉన్నవారు కొన్నేళ్ల తర్వాత జ్ఞాపకశక్తి కోల్పోయే సమస్యను ఎదుర్కొంటారు. ఈ పరిశోధనలో కొంతమంది వ్యక్తుల రోజువారీ నిద్ర అలవాటును గమనించారు. గురక సమస్య ఉన్నవారిలో కొన్ని సంవత్సరాల తర్వాత జ్ఞాపకశక్తి బలహీనత లక్షణాలు కనిపించాయి. ఇది ఎక్కువగా గురక పెట్టేవారిలో అల్జీమర్స్ వ్యాధి ముప్పును పెంచుతుందని పరిశోధనలో తేలింది.
గురక ఎందుకు వస్తుంది?
ఒక వ్యక్తి శ్వాసకోశం బ్లాక్ చేయబడి, ముక్కు, గొంతులో సమస్య ఉన్నప్పుడు గురక మొదలవుతుంది. నిద్రపోతున్నప్పుడు ఈ సమస్య వస్తుంది. దీని కారణంగా శ్వాసతో వచ్చే గాలి కంపిస్తుంది. దాని ధ్వని గురక రూపంలో బయటకు వస్తుంది. ఇంతకుముందు గురక సమస్య వృద్ధుల్లో మాత్రమే కనిపించేది ఇప్పుడు ఈ సమస్య అందరిలో వస్తోంది.
గురకను ఎలా నివారించాలి?
మీకు గురక సమస్య ఉంటే నిద్ర సమయాన్ని మెరుగుపరచండి. వైద్యుడిని సంప్రదించండి. ఈ సమస్యను అధిగమించడానికి వైద్యులు సహాయం చేస్తారు.