Health Tips: ఈ డ్రై ఫ్రూట్‌ని పాలలో మిక్స్ చేసి తింటే సూపర్.. ఈ వ్యాధులన్ని దూరం..!
Health Tips: ఖర్జూరలో ఫైబర్, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి.
Health Tips: ఖర్జూరలో ఫైబర్, కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, సి, ఇ, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాన్ని పాలలో కలిపి తీసుకుంటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. పాలలో ఖర్జూరం వేసి తాగడం వల్ల శరీరానికి బలం రావడమే కాదు అనేక వ్యాధులు దూరమవుతాయి. ఇందుకోసం 3-4 ఖర్జూరాలను పాలతో నానబెట్టి ఉదయం నిద్రలేచిన తర్వాత తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఐరన్ లోపం
ఖర్జూరాలను పాలలో కలిపి తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తొలగిపోతుంది. దీంతో పాటు రక్తహీనత సమస్య దూరమవుతుంది. ఖర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఆపై ఉదయం తీసుకుంటే శరీరానికి ఐరన్ అందడంతో పాటు హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
ఎముకలు దృఢంగా మారుతాయి
పాలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇందులో ఖర్జూరాన్ని జోడించడం వల్ల దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. పాలు, ఖర్జూరం కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి క్యాల్షియంతోపాటు సెలీనియం, మెగ్నీషియం, కాపర్ అందడంతో పాటు ఎముకలు బలపడతాయి. దీంతో పాటు కీళ్ల నొప్పులు, బలహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.
చర్మం మెరిసిపోతుంది
తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చర్మం మెరుపును కోల్పోతారు. మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజే పాలలో ఖర్జూరాన్ని తీసుకోవడం ప్రారంభించండి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది మొటిమలను తగ్గిస్తుంది వృద్ధాప్యాన్ని కూడా తగ్గిస్తుంది.
పొట్ట సమస్య దూరం
మీరు మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటే ఖర్జూరం పాలు మీకు ఉత్తమమైన ఎంపిక అవుతుంది. ఖర్జూరంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పాలలో నానబెట్టి తీసుకుంటే జీర్ణక్రియ సమస్య తొలగిపోయి మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.