Diabetes: ఈ అలవాట్లు ఉంటే షుగర్‌ పేషెంట్‌ అవుతారు..!

Diabetes: నేటి రోజుల్లో ప్రజల జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి.

Update: 2022-09-21 04:52 GMT

Diabetes: ఈ అలవాట్లు ఉంటే షుగర్‌ పేషెంట్‌ అవుతారు..!

Diabetes: నేటి రోజుల్లో ప్రజల జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి. వీటిలో మధుమేహం ఒకటి. దేశంలో లక్షలాది మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అయితే కొన్ని రోజువారీ అలవాట్ల వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మందికి వీటిపై అవగాహన లేదు. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచే అలవాట్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. నిదానమైన జీవనశైలి

ప్రతి ఒక్కరూ విశ్రాంతిని కోరుకుంటారు. కానీ ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం లేదా పడుకోవడం, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం వల్ల గుండె, ఊపిరితిత్తులపై చెడు ప్రభావం ఉంటుంది. ఒక అధ్యయనంలో రోజులో ఎక్కువ సమయం కూర్చొని గడిపే వ్యక్తులకు ఇతర వ్యక్తుల కంటే మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. అందుకని కాసేపయ్యాక సీట్లోంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి.

2. నిద్ర లేకపోవడం

రాత్రిపూట తగినంత నిద్రపోకపోతే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట మేల్కొని ఉండడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల కనీసం 8 గంటలు నిద్రపోవాలి.

3. ఒత్తిడి

ఒత్తిడికి మధుమేహానికి నేరుగా సంబంధం లేదని చాలా అధ్యయనాలు పేర్కొన్నాయి. కానీ ఇది ఖచ్చితంగా ఒక కారణంగా చెప్పవచ్చు. నిజానికి ఒత్తిడి కారణంగా శరీరంలో 'కార్టిసాల్' అనే హార్మోన్ పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ వేగాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక కార్టిసాల్ రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఈ విధంగా డయాబెటిస్ ప్రమాదం ఉంటుంది.

4. ధూమపానం, మద్యం

చాలా మందికి ధూమపానం, మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఇవి నేరుగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహానికి సంబంధించినవి. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల కాలేయం కొవ్వుగా మారి మధుమేహం సమస్య పెరుగుతుంది.

5. జంక్ ఫుడ్స్

జంక్‌ ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది జంగ్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. ఈ అలవాటు మిమ్మల్ని డయాబెటిస్ పేషెంట్‌గా మార్చడానికి కారణమవుతుంది. కాబట్టి ఈరోజే ఈ అలవాట్లని వదిలేయండి.

Tags:    

Similar News