Health Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఈ ఆయిల్ మాత్రమే వాడాలి.. లేదంటే చాలా అనర్థాలు..!

Health Tips: ఫ్యాటీ లివర్ అనేది చాలా తీవ్రమైన సమస్య. సకాలంలో చికిత్స తీసుకోకపోతే లివర్ సిర్రోసిస్ వంటి పెద్ద వ్యాధిగా మారుతుంది.

Update: 2022-11-13 13:31 GMT

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఈ ఆయిల్ మాత్రమే వాడాలి.. లేదంటే చాలా అనర్థాలు..!

Health Tips: ఫ్యాటీ లివర్ అనేది చాలా తీవ్రమైన సమస్య. సకాలంలో చికిత్స తీసుకోకపోతే లివర్ సిర్రోసిస్ వంటి పెద్ద వ్యాధిగా మారుతుంది. ఫ్యాటీ లివర్‌లో కాలేయంపై కొవ్వు పేరుకుపోతుంది. దీని కారణంగా కాలేయం ఫెయిల్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధిలో కొవ్వును చాలా పరిమితంగా తీసుకోవడం మంచిది. ఈ పరిస్థితిలో ఏ నూనె వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ సమస్యను పెంచదు కానీ దాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ పేషెంట్లకు ఏ నూనె ఉత్తమమో ఈ రోజు తెలుసుకుందాం.

నువ్వుల నూనె

ఫ్యాటీ లివర్‌ ఉన్న రోగులు నువ్వుల నూనెను వాడాలి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అలనైన్ అమినోట్రాన్స్‌ఫేరేస్, అస్పార్టేట్ అమినోట్రాన్స్‌ఫేరేస్ మొదలైనవి ఉంటాయి. ఇవి ఫ్యాటీ లివర్ సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి.

మస్టర్డ్ ఆయిల్

భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఆవాల నూనెను ఉపయోగిస్తున్నారు. ఫ్యాటీ లివర్ రోగులు ఆవనూనెలో వండిన ఆహారాన్ని తినాలి. ఆవాల నూనెలో కాలేయం జీర్ణ ఎంజైమ్‌లను పెంచడంలో సహాయపడే లక్షణాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆవనూనెలో చేసిన ఆహారాన్ని తినడం వల్ల జీర్ణక్రియ తేలికగా జరుగుతుంది. ఆవాల నూనె శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఫ్యాటీ లివర్ రోగులకు చాలా మేలు చేస్తాయి. కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వును తొలగించడంలో ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది.

Tags:    

Similar News