Health Tips: రాత్రిపూట ఈ ఆహారాలు తింటే నిద్రపట్టదు.. ఎందుకంటే..?

Health Tips: రాత్రిపూట కొన్నిరకాల ఆహారాలు తినడం వల్ల సరిగ్గా నిద్రపట్టదు.

Update: 2023-06-27 16:15 GMT

Health Tips: రాత్రిపూట ఈ ఆహారాలు తింటే నిద్రపట్టదు.. ఎందుకంటే..?

Health Tips: రాత్రిపూట కొన్నిరకాల ఆహారాలు తినడం వల్ల సరిగ్గా నిద్రపట్టదు. కానీ చాలామందికి ఈ విషయాలు తెలియదు. దీంతో ఏది పడితే అది తినేస్తారు. అర్ధరాత్రి ఇబ్బందిపడుతుంటారు. వాస్తవానికి నిద్ర లేకపోవడం వల్ల ఒక వ్యక్తి అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి. తగినంత నిద్రపోవాలంటే సరైన డైట్‌ పాటించాలి. ఎందుకంటే ఆహారం, పానీయాలు నిద్రపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. రాత్రిపూట ఎలాంటి డైట్‌ పాటించాలో ఈరోజు తెలుసుకుందాం.

మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర

మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల ఒక వ్యక్తి అనేక ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతాడు. వీటిలో గుండె జబ్బులు, బలహీనమైన రోగనిరోధక శక్తి, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే నిద్రపోయే ముందు అనారోగ్యకరమైన వాటిని తినడం మానేయాలి.

కెఫిన్ పానీయాలు

రాత్రి భోజనం చేసేటప్పుడు ఉల్లిపాయ, టొమాటో, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. కెఫిన్ అనేక రకాల ఆహారాలు, పానీయాలలో ఉంటుందని గుర్తుంచుకోండి. టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌ లలో ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. ఇది చాక్లెట్, నొప్పి నివారణ ట్యాబ్లెట్స్‌లో కూడా వాడుతారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.

టొమాటో

నిద్రపోయే ముందు టమోటా తినడం మంచిది కాదు. ఎందుకంటే టమోటాలు యాసిడ్ రిఫ్లక్స్ కలిగిస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. ఒక నివేదిక ప్రకారం రాత్రిపూట టొమాటోలు తీసుకోవడం వల్ల తగినంత నిద్రను పొందగలిగే అవకాశం తక్కువగా ఉంటుందని తేలింది. అందుకే పడుకునేముందు టమోట తినకూడదు.

ఉల్లిపాయ

ఉల్లిపాయ కూడా టమోట లాంటిదే. ఇది జీర్ణవ్యవస్థతో ఆడుకుంటుంది. ఉల్లి కడుపులో గ్యాస్‌ను తయారుచేస్తుంది. పచ్చి లేదా వండిన ఉల్లిపాయలు రెండూ ఇలాంటి సమస్యలను కలిగిస్తాయి. అందుకే రాత్రి పడుకునే ముందు ఉల్లిపాయలను వీలైనంత వరకు తీసుకోవడం మానేయాలి.

ఎన్ని గంటల నిద్ర అవసరం?

సరైన నిద్ర లేకుంటే మెదడు పనితీరుతో పాటు శరీరం కూడా దెబ్బతింటుంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే రోజుకు 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి బరువు నియంత్రణ ఉండదు. ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మంచి నిద్ర ప్రతి ఒక్కరికి అవసరం.

Tags:    

Similar News