Raisins Benefits: చలికాలం ఎండు ద్రాక్ష ఒక వరం.. కడుపు సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Raisins Benefits: శీతాకాలంలో వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
Raisins Benefits: శీతాకాలంలో వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. తేమ, ఫంగస్, బ్యాక్టీరియా వల్ల సులువుగా వ్యాధులు సంభవిస్తాయి. ఎండుద్రాక్ష ఈ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో పాలీఫెనాల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఎండు ద్రాక్షను పాలతో కలిపి తీసుకుంటే శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
1. ఎండుద్రాక్షలో ఉండే పీచు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ఉపయోగం గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు, మలబద్ధకం, అజీర్ణం వంటి అనేక సమస్యలని పరిష్కరిస్తుంది. ఇది శరీరం జీవక్రియను పెంచుతుంది. పేగులని ఆరోగ్యంగా ఉంచుతుంది.
2. ఎండుద్రాక్ష మధుమేహం, అల్జీమర్స్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండు ద్రాక్షను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తిని తాగడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది.
3. ఎండుద్రాక్ష నీరు మలబద్ధకాన్ని నయం చేయడం ద్వారా పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఎండుద్రాక్షలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరుస్తాయి.
4. విటమిన్ సి కారణంగా ఎండుద్రాక్ష శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఎండు ద్రాక్షను పాలతో వేడి చేసి ఆ పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢపరుస్తుంది.