Infertility:ఆల్కహాల్, సిగరేటు తాగితే పిల్లలు పుట్టరా? నిపుణులు ఏం చెబుతున్నారు?
Infertility:ధూమపానం, మద్యపానం ప్రభావం వీర్యకణాల కదలికపై ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు వైద్యులు. సిగరెట్లలో ఉండే నికోటిన్ వంటి విష పదార్థాలు సంతానానికి దూరం చేస్తాయని హెచ్చరిస్తున్నా
Infertility:ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ వాటిని పాటించడంలో మాత్రం అశ్రద్ధ చూపిస్తుంటారు.ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ధూమపానం, మద్యపానం ప్రభావం వీర్యకణాల కదలికపై ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు వైద్యులు. సిగరెట్లలో ఉండే నికోటిన్ వంటి విష పదార్థాలు సంతానానికి దూరం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
పిల్లలు కలగకపోవడానికి కారణాలెన్నో ఉండొచ్చు. కానీ ధూమపానం, మద్యపానం కూడా కారకాలేనని అంటున్నారు వైద్య నిపుణులు. ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుంటే సంతానం కలగడం కష్టమే అంటున్నారు. ఈమధ్య కాలంలో చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. పెళ్లయి 10ఏండ్లు అవుతున్నా పిల్లలు పుట్టక..ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు. అయితే సంతానలేమి సమస్యలకు అనారోగ్య సమస్యలు కొన్ని కారణాలు అయితే ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం అనేవి కూడా ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.
జంటలలో వంద్యత్వానికి కారణాలెన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటికి వైద్య చికిత్స ఉంటే ఇంకొన్ని వారి నియంత్రణలోనే ఉంటాయి. కానీ చాలా మంది ఆ సమస్యను గ్రహించలేక మద్యపానం, ధూమపానం వంటి సేవించి వారిని నియంత్రణను కోల్పోతుంటారు. దీని ఫలితంగా మగవారిలో వంద్యత్వానికి దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు. పురుష పునరుత్పత్తి వ్యవస్థలో సెర్మ్ డెవలప్ చెందడానికి మూడు నెలలు పడుతుంది. ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి కావాలంటే సమతుల్య ఆహారం, వ్యాయామం తప్పనిసరి.
సిగరెట్లలో నికోటిన్ అనే విషయ పదార్థాలు ఉంటాయి. వీటి కారణంగా అధిక స్థాయిలో కాడ్మియం, సీసం వంటి లోహాలకు గురువుతుంటారు. ఇవి పురుషులలో సంతానోత్పత్తి తగ్గడానికి కారణం అవుతాయి. సీసం, కాడ్మియం స్థాయిలు వీర్య కణాల నాణ్యతను తగ్గిస్తాయి. ఫలితంగా పేలవమైన స్పెర్మ్ అనేది ఏకాగ్రత కోల్పోయి వాటి ఆకృతి, కదలిక ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటే మంచిదని వైద్యులు అంటున్నారు.