Health Tips: ఈ విటమిన్​ లోపిస్తే బాడీలో రక్తం తగ్గుతుంది.. నివారించడానికి వీటిని డైట్లో చేర్చండి..!

Health Tips: శరీర నిర్మాణానికి, పనితీరుకు విటమిన్లు చాలా దోహదం చేస్తాయి. ఇవి లోపిస్తే అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతాయి.

Update: 2023-09-26 16:00 GMT

Health Tips: ఈ విటమిన్​ లోపిస్తే బాడీలో రక్తం తగ్గుతుంది.. నివారించడానికి వీటిని డైట్లో చేర్చండి..!

Health Tips: శరీర నిర్మాణానికి, పనితీరుకు విటమిన్లు చాలా దోహదం చేస్తాయి. ఇవి లోపిస్తే అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతాయి. ముఖ్యంగా బాడీలో రక్తం శాతం తగ్గిపోతే విటమిన్​ బి 12 లోపించిందని అర్థం. దీనినే కోబాలమిన్​ అని కూడా పిలుస్తారు. ఇది లోపిస్తే రక్తహీనత సంభవిస్తుంది. అలసట, బలహీనమైన శ్వాస, కళ్లు తిరగడం దీని లక్షణాలు. ఇలాంటి సమయంలో విటమిన్​ 12 అధికంగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆవుపాలు

ఆవుపాలలో దాదాపు అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని సంపూర్ణ ఆహారం అని పిలుస్తారు. ఒక గ్లాసు ఆవు పాలలో 1.2 మైక్రోగ్రాముల కోబాలమిన్ లభిస్తుంది. ఇది కాకుండా మీరు విటమిన్ బి 12 పొందడానికి పెరుగు జున్ను కూడా తినవచ్చు.

గుడ్డు

గుడ్డును సూపర్‌ఫుడ్ అని పిలుస్తారు. ఇది ప్రోటీన్​కి గొప్ప మూలం. విటమిన్ B12 కూడా ఇందులో లభిస్తుంది. ఉడకబెట్టిన గుడ్డు తింటే రోజువారీ అవసరాలలో 25 శాతం కోబాలమిన్ లభిస్తుంది.

చికెన్ లివర్‌

చికెన్ లివర్‌లో కోబాలమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఒక గిన్నె చికెన్ లివర్ తింటే 4.7 మైక్రోగ్రాముల విటమిన్ బి12 లభిస్తుంది. అంతే కాకుండా చికెన్ బ్రెస్ట్ ద్వారా కూడా విటమిన్ బి12 పొందవచ్చు.

తృణధాన్యాలు

శరీరంలో రక్తహీనత ఉన్నట్లయితే సాధారణ తృణధాన్యాలకు బదులుగా బలవర్థకమైన తృణధాన్యాలు తీసుకోవాలి. ఉదాహరణకు హోల్ వీట్ ఓట్స్‌లో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. దీనిని తినడం వల్ల ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ కూడా లభిస్తాయి.

కొవ్వు చేపలు

కొవ్వు చేపలు ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతారు. సార్డినెస్, ట్యూనా, రెయిన్‌బో ట్రౌట్, సాల్మన్ వంటి చేపలలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, సెలీనియం కూడా ఉంటుంది. అయితే డాక్టర్​ సలహా ప్రకారమే వీటిని తీసుకోవాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News